AP: ఆంధ్రాలో ఉగాది నుంచి ఫ్రీ బస్సు!

సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిచనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు.

New Update
APSRTC: కార్తీక మాసం సందర్భంగా గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ!

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం దిశగా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు.. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులతో నిన్న సమీక్షించారు.

అధ్యయనం చేయండి..

ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీల్లో ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ పథకాన్ని ఇప్పటికే అమలు చేశాం. ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే ఈ పథకాన్ని అమలు చేయాలంటే 3,500 బస్సులు, 11,500 మంది సిబ్బంది అవసరమని సీఎంకు ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు. కనీసం రెండువేలు కొత్త బస్సులు లేదా అద్దె బస్సులు లేకుండా ఉచిత ప్రయాణం హామీ అమలు చేయలేమని చెప్పారు. కానీ ఉచిత ప్రయాణం వలన ఆంధ్రాలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్సుపెన్సీ పెరుగుతుందని చెపారు. ఇప్పటి వరకు 69 శాతం ఉన్న ఇది ఉచిత ప్రయాణం మొదలుపెడితే 94 శాతానికి పెరుగుతుందని అధికారులు అంటున్నారు. కానీ దీనివలన ప్రభుత్వం మీద  ప్రతి నెలా రూ.265 కోట్ల భారం పడే అవకాశం ఉందన్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకోవాలని చెప్పారు. 

Also Read: High Court: జనవరి 9 వరకు హరీశ్ ను అరెస్టు చేయొద్దు-హైకోర్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు