APSRTC: ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు

ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్ని వచ్చే వారంలో చెల్లిస్తామని ఆర్టీసీ ఎండీద్వారకా తిరుమలరావు ప్రకటించారు.త్వరలో రాష్ట్రానికి వెయ్యికిపైగా విద్యుత్తు బస్సులు రానున్నాయని డీజీపీ, ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ తెలిపారు.

New Update
APSRTC

Aps RTC: ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందికి.. డీజీపీ,ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రత్యేకంగా అభినందించారు. సంక్రాంతి సమయంలో మంచి ఎఫర్ట్‌ పెట్టిన ఆర్టీసీ అధికార యంత్రాంగాన్ని, ఉద్యోగులు, సిబ్బందిని అభినందిస్తున్నానని తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌, గ్యారేజీని ద్వారకా తిరుమల రావు సందర్శించిన సంక్రాంతికి అదనంగా ఆర్టీసీ బస్సులను పెద్దఎత్తున నడపడం ద్వారా గతేడాది రూ.20 కోట్ల ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు.

Also Read: Attack on Dalits: దారుణం.. పనికి రానందుకు ముగ్గురు దళితులపై విచక్షణారహితంగా దాడి..

ఈ ఏడాది మరింత ఆదాయం పెరిగే అవకాశాలున్నాయన్నారు. సంక్రాంతి సమయంలో ప్రత్యేక చార్జీలు వసూలు చేయకుండానే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం సంతోషంగా ఉందన్నారు. కమర్షియల్‌ ఆదాయమూ పెంచుకోవడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామని ఎండీ ద్వారకా తిరుమల రావు అన్నారు.

Also Read: ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి... ప్రియురాలితో పెళ్లి కోసం ముస్లిం నుంచి హిందూమతంలోకి

పెండింగ్ బకాయిల్ని...

ఆర్టీసీ సిబ్బందికి పెండింగ్ బకాయిల్ని (ఎరియర్స్‌)ను ఇప్పటికే కొంత చెల్లించామన్నారు.  వారం రోజుల్లో మిగిలిన బకాయిల్లో 25 శాతం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆర్టీసీ సిబ్బందికి 2017 పీఆర్సీ బకాయిలు 50 శాతం చెల్లించామని ఆయన గుర్తు చేశారు. ఈ సంక్రాంతికి వచ్చిన ఆదాయాన్ని బట్టి వారం రోజుల్లో మరో 25 శాతం చెల్లించే అవకాశం ఉందన్నారు. 

1,500 కొత్త బస్సులను...

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,500 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేశామని.. మరో వెయ్యికి పైగా ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్నారు. ఆర్టీసీ స్థలాల్లో షాపింగ్‌ మాల్స్‌ ఏర్పాటులో నిబంధనలను పాటిస్తామన్నారు. 

Also Read: Donald Trump: అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది..తొలి స్పీచ్‌ తో అదరగొట్టిన ట్రంప్‌!

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశి వారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా బెటర్‌!

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: ఏపీలో దారుణం.. పంపు బాయ్ ఫకృద్దీన్‌ను స్తంభానికి కట్టేసి కొట్టిన మేనేజర్లు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుమ్మరవాండ్లపల్లిలో ఉన్న పెట్రోలు బంకులో పని చేస్తున్న పంపు బాయ్ బాబా ఫకృద్దీన్‌ రూ.23 వేలు తీసుకున్నాడని మేనేజర్లు అతని దుస్తులు ఊడదీసి టెలిఫోన్‌ స్తంభానికి కట్టేసి శారీరకంగా దాడి చేశారు.

New Update
Sri Sathya Sai crime news

Sri Sathya Sai crime news

AP Crime: శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఒక పెట్రోలు బంకులో తీవ్ర ఉద్రిక్తత కలిగించిన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో ఉన్న పెట్రోలు బంకులో పనిచేస్తున్న పంపు బాయ్ బాబా ఫకృద్దీన్‌పై మేనేజర్లు పాశవికంగా ప్రవర్తించారు. ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఫకృద్దీన్‌ను బంకు మేనేజర్లు సత్యనారాయణ, అమర్‌లు నిలిపి, డబ్బులు తక్కువగా జమ చేశారంటూ ప్రశ్నించారు. వారి మాటల ప్రకారం.. రూ.23 వేలు తక్కువగా ఉన్నాయని ఆరోపించారు.

పెట్రోలు బంకులో అమానవీయ ఘటన..

దీనికి స్పందించిన ఫకృద్దీన్‌ తాను ఎలాంటి డబ్బులను వాడలేదని.. వచ్చిన మొత్తాన్ని వారికి అప్పగించానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే మేనేజర్లు ఆ వివరణను పట్టించుకోకుండా తక్కువగా ఉన్న డబ్బులు ఇచ్చే వరకు అక్కడి నుంచే కదలవద్దని హెచ్చరించారు. వెంటనే ఆగ్రహానికి లోనైన మేనేజర్లు అతని దుస్తులు ఊడదీసి స్థానిక టెలిఫోన్‌ స్తంభానికి కట్టేసి శారీరకంగా దాడికి దిగారు. ఈ దారుణ ఘటనతో ఫకృద్దీన్‌ తీవ్రంగా గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: ఈ 5 ఫుడ్‌ ఐటెమ్స్ తినే మహిళలు ఎక్కువ కాలం యవ్వనంగా ఎలా ఉంటారు?

 

మానవత్వం ఉంది అంటారా ఈ పేద ముస్లిం కుటుంబాన్ని అండగా నిలిచేది ఎవరు? కదిరి కుమ్మర వాండ్లపల్లి నయారా పెట్రోల్ బంకులు...

Posted by Jeelan Basha on Saturday, May 31, 2025


సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది. బాధితుడి వాంగ్మూలాన్ని తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పెట్రోలు బంకు వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు బత్తల హరిప్రసాద్‌కు చెందినదిగా సమాచారం. ప్రస్తుతం హరిప్రసాద్ బదులు ఆయన తమ్ముడు తోట హరిప్రసాద్‌ ఈ బంకును నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: మహబూబ్‌నగర్‌లో క్షుద్ర పూజల కలకలం.. మూఢనమ్మకాల మాయలో మరుగున పడిన మానవత్వం

(ap crime updates | ap-crime-news | ap crime latest updates | Latest News | telugu-news)

 

Advertisment
Advertisment