Weather Update: తీరం దాటిన మొంథా తుపాను.. ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా అర్థరాత్రి సమయంలో తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు సమీపంలోని నరసాపురానికి దగ్గరలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య మొంథా తుపాను తీరం దాటినట్లు వెల్లడించారు.

New Update
Montha Tooffan

Montha Tooffan

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా అర్థరాత్రి సమయంలో తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు సమీపంలోని నరసాపురానికి దగ్గరలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య మొంథా తుపాను తీరం దాటినట్లు వెల్లడించారు. అయితే మొంథా తుపాను తీరం దాటినప్పటికి తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుపాను తెలంగాణ మీదుగా ఛత్తీస్‌గఢ్ దగ్గర బలహీన పడే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో ఏపీతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: దిశ మార్చుకున్న మొంథా తుపాను.. తీరం దాటడంలో ట్విస్ట్

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

మొంథా తుపాను ప్రభావం ఏపీకి అధికంగా ఉండటంతో అధికారులు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కాకినాడ, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, అల్లూరి, ఏలూరు, మన్యంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Montha Cyclone: మొంథా తుఫానుపై ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ..ఆర్ & బీ శాఖకు ప్రత్యేక ఆదేశాలు

ఈ మొంథా తుపాను ప్రభావం వల్ల తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట్, ఖమ్మం, వనపర్తి, మహబూబ్‌నగర్, రంగారెడ్డిలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు