/rtv/media/media_files/2025/10/13/india-to-witness-colder-winter-this-year-2025-10-13-10-31-47.jpg)
Colder
మొంథా తుపాను తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. అయితే ఈ తుపాను తర్వాత తెలుగు రాష్టాల్లో వర్షాల కంటే చలి ఎక్కువ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. రోజురోజుకీ చలి తీవ్రత కూడా బాగా పెరుగుతోంది. ప్రస్తుతం చాలా చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. తెలంగాణలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలోని బేల ప్రాంతంలో నమోదైంది. 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా చలి పెరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 17.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 18.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నవంబర్ 9వ తేదీన మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇది కూడా చూడండి: Wine shops : మందుబాబులకు బిగ్ షాక్.. 4 రోజులు వైన్ షాపులు బంద్
ఈ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు..
ఇక పటాన్ చెరు ఈక్రిశాట్‌లో 19.4, హయత్ నగర్‌లో 19.6 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రత ఖమ్మంలో 34.2 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో అత్యల్పంగా 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్, అత్యధికంగా 29 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అయితే నేడు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంటుంది. అయితే అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఏపీలో పాడేరు (14.2 డిగ్రీలు), అరకు (14.9 డిగ్రీల సెల్సియస్)లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పూట పొగమంచుతో పాటు చలి తీవ్రత ఎక్కువ ఉంది. అలాగే ఏపీలో కూడా కోనసీమ, నెల్లూరు, తిరుపతిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Maoist Partys Ceasefire: కాల్పుల విరమణ ఊహించని పరిణామం..మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
Follow Us