Ap High Court: హైకోర్టు సంచలన తీర్పు.. సీఐడీకి పరకామణి కేసు!
తిరుమల పరకామణి కేసు విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు సీఐడీకి అప్పగించింది. అయితే పరకామణి కేసులో టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ కౌంటర్ దాఖలు చేశారు.
తిరుమల పరకామణి కేసు విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు సీఐడీకి అప్పగించింది. అయితే పరకామణి కేసులో టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ కౌంటర్ దాఖలు చేశారు.
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల్లో రీపోలింగ్ నిర్వహించాలని YCP దాఖలు చేసిన పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడిందని వైసీపీ ఆరోపించింది.
YS జగన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. సింగయ్య మృతి కేసులో జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ మేరకు పిటిషన్‌పై విచారణను మంగళవారానికి (జులై 1) వాయిదా వేసింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
సుప్రీం కోర్టు కొలీజియం దేశవ్యాప్తంగా ఉన్న పలు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సిఫార్సు చేసింది. CJI బీఆర్ గవాయ్ నేతృత్వంలోని 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీకి కొలీజియం ప్రతిపాదించింది. తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.
ఏపీ హైకోర్టుకు వెసవి సెలవులు ప్రకటించారు. రేపటి(మే12) నుంచి నెలరోజుల పాటు వేసవి సెలవులు అమల్లో ఉంటాయి. తిరిగి జూన్ 16న పూర్తిస్థాయి కోర్టు కార్యకలపాలు తిరిగి ప్రారంభమవుతాయి. సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేశారు.
ఏపీకి చెందిన డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్‌రావు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాదని కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు గాను ఆయనను తహసీల్దార్ స్థాయికి డిమోట్ చేయాలని ఆదేశించింది.
క్రైస్తవంలోకి మారే SCలకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. క్రిస్టియన్‌గా మారిన రోజునుంచే ఎస్సీ హోదాను కోల్పోతారని, ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి ఎలాంటి రక్షణ పొందలేరని తెలిపింది. ఓ పాస్టర్ కేసులో న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ కీలక తీర్పు ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. మాలమహానాడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ ఆధారంగా జరిగిందని పిటిషన్ లో పేర్కొంది.
సోషల్ మీడియాలో వ్యంగ్య వీడియో పోస్టుచేసిన ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయడంపై APహైకోర్టు ఫైరయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడింది. అలా అయితే సినిమా హీరోలను, విలన్లను కూడా అరెస్ట్ చేయాలంటూ పేర్కొంది.