/rtv/media/media_files/2025/05/27/Xp7bvzLUIWCEO7FfaItQ.jpg)
High Court: సుప్రీం కోర్టు కొలీజియం దేశవ్యాప్తంగా ఉన్న పలు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సిఫార్సు చేసింది. CJI బీఆర్ గవాయ్ నేతృత్వంలోని 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీకి కొలీజియం ప్రతిపాదించింది. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. కర్నాటక హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుమలత, జస్టిస్ లలిత కన్నెగంటి తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!
#BREAKING Supreme Court Collegium recommends transfer of 21 High Court judges pic.twitter.com/QVAhfgNhzb
— Live Law (@LiveLawIndia) May 27, 2025
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిషేక్‌రెడ్డి తెలంగాణ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ అయ్యారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సుజయ్ పాల్ కల్‌కత్తా హైకోర్టుకు, కర్నాటక హైకోర్టు జస్టిస్ వీ కామేశ్వరరావు ఢిల్లీ హైకోర్టుకు, గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జమీర్ కలకత్తా హైకోర్టుకు బదిలీలు అయ్యారు. మొత్తం 21 మంది న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి.