High court: వారు ఎస్సీలు కాదు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!

క్రైస్తవంలోకి మారే SCలకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. క్రిస్టియన్‌గా మారిన రోజునుంచే ఎస్సీ హోదాను కోల్పోతారని, ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి ఎలాంటి రక్షణ పొందలేరని తెలిపింది. ఓ పాస్టర్ కేసులో న్యాయమూర్తి జస్టిస్‌ హరినాథ్‌ కీలక తీర్పు ఇచ్చారు.

New Update
ap high

AP High Court big shock to SC converting to Christianity

AP High court: క్రైస్తవంలోకి మారే SCలకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. క్రిస్టియన్‌గా మారిన రోజునుంచే ఎస్సీ హోదాను కోల్పోతారని, ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి ఎలాంటి రక్షణ పొందలేరని తెలిపింది. ఓ పాస్టర్ కేసులో న్యాయమూర్తి జస్టిస్‌ హరినాథ్‌ కీలక తీర్పు ఇచ్చారు. 

తప్పుడు ఫిర్యాదుతో చట్టం దుర్వినియోగం..

ఈ మేరకు ఇటీవల గుంటూరు జిల్లా కొత్తపాలెంకు చెందిన పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన రామిరెడ్డి, మరో ఐదుగు తనను కులం పేరుతో దూషించి, దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును కొట్టవేయాలంటూ రామిరెడ్డితోపాటు మిగతా ఐదుగురు 2022లో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తప్పుడు ఫిర్యాదుతో చట్టాన్ని దుర్వినియోగం చేశారని మండిపడింది. పోలీసులు ఛార్జిషీట్‌ వేయకుండా ఉండాల్సిందని చెబుతూ కేసు కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ స్పష్టం చేశారు. 

Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు

పిటిషనర్ల తరఫు న్యాయవాది జేవీ ఫణిదత్‌ వాదనలు వినిపించారు. ‘ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి పదేళ్లుగా పాస్టర్ గా పనిచేస్తున్నారు. క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదు. రాజ్యాంగం (షెడ్యూల్డ్‌ కులాలు) ఆర్డర్‌-1950 ప్రకారం హిందువు కాకుండా ఇతర మతాలను స్వీకరిస్తే ఎస్సీ హోదాను కోల్పోతారు. కులవ్యవస్థను క్రైస్తవం గుర్తించదు. క్రైస్తవులకు ఎస్సీ, ఎస్టీ చట్టం రక్షణ ఉండదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని పరిగణనలోకి తీసుకుని కేసు కొట్టేవేయాలని కోర్టును విజ్ఞప్తి చేశారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన జడ్జీ కీలక తీర్పు వెల్లడించారు. 

Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!

christian | sc caste | ap-high-court | telugu-news | today telugu news

Advertisment
తాజా కథనాలు