డిప్యూటీ కలెక్టర్‌ కోర్టు ధిక్కారం...సుప్రీం సంచలన తీర్పు

ఏపీకి చెందిన డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్‌రావు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాదని కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు గాను ఆయనను తహసీల్దార్‌ స్థాయికి డిమోట్ చేయాలని ఆదేశించింది.

New Update
Deputy Collector's contempt of court

Deputy Collector's contempt of court

కోర్టు ధిక్కారణకు పాల్పడినందుకు గాను ఏపీలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న తాతా తాతా మోహన్‌రావును తహసీల్దార్‌ స్థాయికి డిమోట్‌ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మోహన్‌రావు 2013లో తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడులో గుడిసెలను తొలగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని కోర్టు ధిక్కారణ కింద తీసుకున్న సుప్రీంకోర్టు ఆయనపై వేటు వేసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ ఏజీ మసీహ్‌లతో కూడిన బెంచ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడులో గుడిసెలను తొలగించరాదని హైకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు హైకోర్టు మోహన్‌రావుకు 2 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ 2015 మార్చి 27న తీర్పునిచ్చింది.  అయితే దీన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ భూమిని రక్షించడానికే తాను చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నట్లు మోహన్‌ రావు కోర్టుకు వెల్లడించారు. ఉమ్మడి రాష్ర్ట విభజన జరుగుతున్న సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని, దాన్ని ఆసరగా తీసుకు కొందరు రాత్రికి రాత్రి గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. ఆ  గుడిసెలను మాత్రమే తొలగించామని మోహన్‌ రావు కోర్టుకు  చెప్పారు. అయితే హైకోర్టు తీర్పు ప్రకారం తాను 48 గంటలకు మించి జైల్లో ఉంటే ఉద్యోగం పోతుందని, దానివల్ల తన కుటుంబం రోడ్డున పడుతుందని, పిల్లల చదువులు దెబ్బతింటాయని మోహన్‌రావు కోర్టులో వాపోయారు.

Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

దీంతో సుప్రీం కోర్టు, హైకోర్టు మోహన్‌రావుకు విధించిన శిక్షను సవరించి.. డిప్యూటీ కలెక్టర్‌ పదవి నుంచి తహసీల్దార్‌ పోస్టుకు డిమోట్‌ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానితో పాటు పేదల ఇళ్లు కూల్చినందుకు గాను ఆ ఇళ్ల నిర్మాణం కోసం  నాలుగు వారాల్లోపు రూ.లక్ష జరిమానా చెల్లించి, రసీదు కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి పదోన్నతుల కోసం ఆయన సీనియారిటీని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవచ్చు’ అని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే కోర్టు తీర్పును అనుచరించి డిప్యూటీ కలెక్టర్‌ నుంచి తహసీల్దార్‌గా పనిచేసేందుకు అంగీకరిస్తూ అంగీకార పత్రం ఇవ్వాలని గతంలోనే  సూచించినా మోహన్‌రావు అంగీకరించకపోవడాన్ని జస్టిస్‌ గవాయ్‌ తీవ్రగా పరిగణించారు. మోహన్‌రావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పిటిషనర్‌ తొలిరోజే ఇందుకు అంగీకరిస్తే మేం 2, 3 ఇంక్రిమెంట్ల కోతతో ఆపేసేవాళ్లం. కానీ నాలుగు వాయిదాల వరకు తీసుకొచ్చారు. ఈ రోజు కూడా అంగీకరించకపోతే ఏ ప్రభుత్వం సాహసించలేని ఉత్తర్వులిచ్చేవాళ్లం.” అని న్యాయమూర్తి  ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

Advertisment
తాజా కథనాలు