Jai Shankar: అమెరికా అమెరికాలోనే ఉంది..భారత్, పాక్ కాల్పుల విరమణలో దాని జోక్యం లేదు..జైశంకర్
భారత్, పాక్ కాల్పుల విరమణ విషయాన్ని తమ రెండు దేశాలే చర్చించుకుని నిర్ణయించుకున్నాయని.. అమెరికాను వేలు పెట్టనివ్వలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి గట్టిగా చెప్పారు. ట్రంప్ తానే యుద్ధాన్ని ఆపానని పదే పదే చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేశారు.