/rtv/media/media_files/2025/09/06/pm-modi-and-trump-likely-to-meet-on-the-sidelines-of-asean-summit-on-oct-26-2025-09-06-21-49-25.jpg)
PM Modi and Trump Likely to Meet
PM Modi gets invite from Trump : భారత ప్రధాని నరేంద్ర మోడీ కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఆహ్వానం లభించినట్లు సమాచారం.ఈజిప్టులో సోమవారం జరగనున్న ‘గాజా శాంతి ఒప్పందం’ సమావేశానికి రావాలని మోడీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈజిప్టు అధ్యక్షుడు కూడా ఆయనను ఆహ్వానించారు. ఈ ఒప్పందంలో ప్రధానంగా హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరు అవుతారా లేదా అనే విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.