Trump VS Nobel Prize: నోబెల్ బహుమతుల ప్రకటన..గాజా శాంతి కార్డు సక్సెస్...ట్రంప్ బిగ్ స్కెచ్

గత మూడు రోజులుగా నోబెల్ బహుమతులను ప్రకటిసతున్నారు. రేపు పీస్ అవార్డ్ విన్నర్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను నోబెల్ వరిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశం అయింది. 

New Update
trump vs nobel

ఒక వైపు నోబెల్ బహుమతులను ప్రకటిస్తున్నారు. మరోవైపు గాజా శాంతి ప్రణాళికలో మొదటి దశపై ఇరు వర్గాలు సంతకాలు చేశాయి. చాలా రోజుల నుంచీ ఎనిమిది యుద్ాలను ఆపానని చెప్పుకుంటున్నారు ట్రప్ తాను అన్ని విధాలా నోబెల్ కు అర్హుడునని అంటున్నారు దానిపై బోలెడు ఆశలు పెట్టుకుని కూర్చున్నారు. ఈ టైమ్ లో ట్రంప్ కు ప్రపంచ పీస్ మేకర్ అని పొగడ్తలు దక్కుతున్నాయి. ఇదంతా ట్రంప్ కావాలనే ప్లాన్ చేశారా. నోబెల్ శాంతి బహుమతులను ఇంకో రోజులో అనౌన్స్ చేస్తారనగా..ఇజ్రాయెల్, హమాస్ లు గాజా శాంతి ప్రణాళికపై సంతకాలు చేశారు. ఇదంతా అమెరికా అధ్యక్షుడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా అనే చర్చ తెగ జోరుగా నడుస్తోంది. 

అంతా పక్కా ప్లాన్ ప్రకారమే..

గాజా శాంతి ప్రణాళిక ఒప్పందపై ప్రపంచ దేశాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రేండేళ్ళ యుద్ధానికి తెర పడినందుకు అందరూ సంతోషిస్తున్నారు. అయితే ఇదంతా ట్రంప్ పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని అంటున్నారు. చాలా రోజులుగా నోబెల్ శాంతి బహుమతి తనకు రావాలని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు చివరి ప్రయత్నంగా కరెక్ట్ గా బహుమతి ప్రకటనకు ఒకరోజ ముందు గాజా శాంతి ప్రణాళిక ఒప్పందం అయ్యేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఇదొక రాజకీయ చిత్రమని చెబుతున్నారు. ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య శాంతి ఒప్పందంలో మొత్తం అడుగు అడుగుక ట్రంప్ క్రెడిట్ పొందారు. అబ్రహం ఒప్పందాల నుంచి ఖైదీల మార్పిడి వరకూ అన్నీ తానే ముందుండి చూసుకున్నారు.

అలాగే చాలా రోజుల నుంచి దాదాపు ప్రెస్ తో మాట్లాడిన ప్రతీసారి తాను అధ్యక్షుడిని అయ్యాకనే ప్రపంచం శాంతిగా ఉందని...ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకుంటూనే వస్తున్నారు. భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణలో కూడా తన హస్తమే ఉందని ట్రంప్ పదేపదే ప్రకటించుకున్నారు. దీనిని ఇండియా ఎన్నిసార్లు ఖండించినా...ఆయన మాత్రం తానే చేశానని ఇప్పటికీ చెబుతున్నారు. తాను అన్ని విధాలా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడునని అంటూనే ఉన్నారు. ఇప్పుడు గాజా శాంతి ప్రణాళిక ఒప్పందం కూడా నోబెల్ జ్యూరీ దృష్టిలో పడేందుకే..ఒకరోజు ముందు అయ్యేలా చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు ఇప్పటికే పాకిస్తాన్, అజర్ బైజాన్, అర్మేనియా, కంబోడియా వంటి దేశాలు అమెరికా అధ్యక్షుడిని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశాయి. 

కష్టమే అంటున్న విశ్లేషకులు..

ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిపై చాలా పట్టుదలగా ఉన్నారు. ఆ అవార్డును తనకు ఇవ్వకపోతే అమెరికాకే అవమానం అంటూ మాట్లాడారు. అయితే నిపుణుల ప్రకారం నోబెల్ బహుమతి ట్రంప్ కు రాకపోవచ్చని చెబుతున్నారు. దానిని ఎప్పుడూ నిశ్శబ్దంగా శాంతిని నెలకొల్పే సంస్థలు లేదా వ్యక్తులకు దాన్ని ప్రకటిస్తారని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు సరిగ్గా దీనిని వ్యతిరేంగా పీస్ అవార్డ్ కోసం మొదటి నుంచి ప్రచారం చేసుకుంటూనే ఉన్నారని చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు