Trump-Modi: ట్రంప్ కు ప్రధాని మోదీ ఫోన్..గాజా శాంతిపై అభినందనలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గాజా శాంతి ప్రణాళిక సక్సెస్ పై ఆయనను అందరూ ప్రశంసిస్తున్నారు. భారత ప్రధాని మోదీ కూడా ట్రంప్ కు ఫోన్ చేసి మరీ అభినందించారని తెలుస్తోంది. 

New Update
Modi-Trump wishing

చారిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతం కావడానికి పట్టుదలగా కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను భారత ప్రధాని మోదీ అభినందించారు. ఇరు దేశాధినేతలూ ఫోన్ లో మాట్లాడుకున్నారు. దాంతో పాటూ ఇండియా, అమెరికాల మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి మీదనా సమీక్షించామని ప్రధాని మోదీ తెలిపారు. భవిష్యత్తులో సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి అంగీకరించామని మోదీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అంతకుముందు గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్‌, హమాస్‌ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనను ప్రధాని మోదీ స్వాగతించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బలమైన నాయకత్వానికి ఇది నిదర్శనమని అన్నారు. బందీలను విడుదల చేయడం, యుద్ధాన్ని ఆపడం ద్వారా గాజాలో మానవతా సహాయం అందుతుందని...తద్వారా శాంతి చేకూరుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 

మొదటి దశ ఒప్పందంపై సంతకాలు..

గాజా శాంతి ప్రణాళిక ఒప్పందం లో మొదటి దశకు ఇజ్రాయెల్, హమాస్ లు అంగీకరించాయి. దీనికి సంబంధించి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా హమాస్ తన దగ్గర ఉన్న బందీలను విడిచి పెడుతుంది. ఇజ్రాయెల్ గాజా నుంచి తన దళాలను ఉపసంహరించుకుంటుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించారు. గాజా శాంతి ఒప్పందంలో మొదటి దశకు ఇజ్రాయెల్, హమాస్ లు అంగీకరించినందుకు గర్వంగా ఉంది అటూ ట్రంప్ పోస్ట్ లో రాశారు. అన్ని వర్గాలను సమానంగా చూస్తామని...అరబ్‌, ముస్లిం, ఇజ్రాయెల్‌, ఇతర చుట్టు పక్కల దేశాలకు, అమెరికాకు ఇది ఎంతో గొప్ప రోజని చెప్పారు. ఈ మొత్తం జరగడానికి మాతో పాటూ కలిసి పని చేసిన ఖతార్, ఈజిప్ట్, టర్కీలకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ పోస్ట్ లో పెట్టారు.

Also Read: వరల్డ్ టాప్ హండ్రెడ్ లో భారత యూనివర్శిటీలకు దక్కని చోటు..పధ్నాలుగేళ్ళల్లో ఇదే మొదటిసారి

Advertisment
తాజా కథనాలు