Trump Nobel: ఏమీ చేయని వాళ్ళకు ఇచ్చారు..ఒబామాకు నోబెల్ రావడంపై ట్రంప్ అక్కసు

ఈరోజు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించనున్నారు. దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీని గురించి మాట్లాడుతూ ఏమీ చేయని ఒబామా లాంటి వారికి ఇచ్చారు..నాకు ఇస్తారో, ఇవ్వరో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

New Update
Trump

Trump

నోబెల్ శాంతి బహుమతి...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఇదో పెద్ద ప్రస్టీజ్ ఇష్యూ అయిపోయింది. రెండో సారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నోబెల్ శాంతి బహుమతికి టార్గెట్ చేశారు ట్రంప్. దానిపై ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. ఈరోజు ఆ అవార్డుల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రెస్ తో దీని గురించి మాట్లాడారు. గాజాతో పాటూ ప్రపంచంలో శాంతి నెలకొల్పానని ఆయన చెప్పుకున్నారు. ఎనిమిది యుద్ధాలను ఆపానని మరోసారి పునరుద్ఘాటించారు. నోబెల్ శాంతి బహుమతి తనకు కచ్చితంగా రావాల్సిందేనని అన్నారు. తన అవార్డును ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ఏమీ చేయని ఒబామా లాంటి వారికి నోబెల్ ఇచ్చారు. తనకు ఎందుకు ఇవ్వరో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ట్రంప్. అమెరికాకు రెండుసార్లు అధ్యక్షుడిగా ఉన్న ఒబామా ఏమీ చేయలేదని...ఐగా అమెరికాను నాశనం చేశారని విమర్శించారు. అతనికి అవార్డ్ వచ్చింది. ఎందుకిచ్చారో అతనికి కూడా తెలియదు. బహుశా అమెరికాను నాశనం చేసినందుకు ఇచ్చి ఉంటారని ఒబామా గురించి వ్యాఖ్యలు చేశారు. కానీ నేను ఎనిమిది యుద్ధాలను ఆపడంలో విజయం సాధించానని అన్నారు. ఇలాంటిది ఇంతకు ముందు ఎవరూ చేయలేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇన్ని చేసినా తనకు నోబెల్ ఇవ్వరు. ఇవ్వరని కూడా నాకు తెలుసు. అయినా నేను ఆ అవార్డ్ కోసం ఏమీ చేయలేదు. ప్రజల ప్రాణాలు కాపాడ్డానికే యుద్ధాలను ఆపానని ట్రంప్ అన్నారు. 

ట్రంప్ కు అది ఇవ్వాల్సిందే..

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ విషయమై మరోసారి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతిని కచ్చితంగా ఇవ్వాలని ఆయన అంటున్నారు. దానికి ట్రంప్ అన్ని విధాలుగా అర్హుడని నెతన్యాహు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. పోస్ట్ తో పాటూ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి వచ్చినట్టు...దానిని తానే ఆయన మెడలో వేస్తున్నట్టు నెతన్యాహు ఏఐ పిక్ పెట్టారు. కాసేపట్లో శాంతి బహుమతిని అనౌన్స్ ఉందనగా నెతన్యాహు ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Also Read: Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరించకూడదు..ప్రభుత్వ సంచలన నిర్ణయం  

Advertisment
తాజా కథనాలు