Illinois: నేషనల్ గార్డ్స్ రావడానికి వీల్లేదు..అడ్డుకున్న ఇల్లినాయిస్ కోర్టు

షికాగోలో నేషనల్ గార్డ్స్ ను దింపాలనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నానికి అక్కడి ఫెడరల్ కోర్టు అడ్డుకట్ట వేసింది. గవర్నర్, మేయర్ అనుమతి లేకుండా నేషనల్ గార్డ్స్ మోహరించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. 

New Update
Trump

Trump

ఇల్లినాయిస్, షికాగోలో నేషనల్ గార్డ్స్ దింపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడి మేయర్, గవర్నర్ లతో గొడవ కూడా పెట్టుకున్నారు. షికాగో మేయర్‌ బ్రాండన్‌ జాన్సన్‌, ఇల్లినోయీ గవర్నర్‌ జేబీ ఫ్రిట్కర్‌లపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షికాగోలో ప్రభుత్వ సంస్థలను రక్షించడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. అక్కడి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు భద్రత కల్పించలేకపోయారని...ఇందుకు గానూ మేయర్, గవర్నర్ లను జైల్లో పెట్టాలని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలకు ధీటుగా ఇల్లినోయి గవర్నర్ ప్రిట్జ్ కర్ కూడా స్పందించారు. నా ప్రజలను కాపాడుకోవడానికి తాను ఎప్పుడూ ముందుంటానని..రండి నన్ను అరెస్ట్ చేయండి అంటూ ప్రకటించారు. దాంతో పాటూ ట్రంప్ ఒక నియంత అంటూ ఆరోపించారు.  

అది రాజ్యాంగ విరుద్ధం..

ఈ వివాదంపై ఇల్లినాయిస్ ఫెడరల్ కోర్టు ఈ రోజు తీర్పు ప్రకటించింది. నేషనల్ గార్డ్స్ ను మోహరించకూడదని తీర్పు ఇచ్చింది. రాష్ట్ర అనుమతి లేకుండా షికాగో కు దళాలను పంపించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభివర్ణించింది. ఇప్పటికే దళాలు అక్కడ ఉన్నాయి. అందుకు గవర్నర్, మేయర్ ఇద్దరూ అనుమతి ఇవ్వలేదు. వారిని వెంటనే అక్కడ నుంచి పంపించేయాలని కోర్టు చెప్పింది. న్యాయ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎరిక్ హామిల్టన్ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, నగరం విషాదకరమైన చట్టరాహిత్యాన్ని ఎదుర్కొంటోందని వ్యాఖ్యలు చేశారు. 

అక్రమ వలసల కట్టడిపై షికాగో ప్రజల ఆందోళన..

ట్రంప్ పరిపాలనలోకి వచ్చాక అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేస్తున్నారు. చాలా మందిని విమానాలు పెట్టి మరీ స్వదేశాలకు పంపించేశారు. దాని తరువాత ఒక్కో రాష్ట్రంలో అక్రమ వలసదారులను ఏరి వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో చాలా చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. లాస్ ఏంజెలెస్ లో కూడా సడెన్ గా అక్రమ వలసదారులపై అటాక్ చేయడంతో అక్కడ నిరసనలు చుట్టుముట్టాయి. దాని తరువాత షికాగోలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తనిఖీలు చేసేందుకు వచ్చిన ఇమ్మిగ్రేషన్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో షికాగోలోని వలస సేవల కేంద్రాల దగ్గర తరచూ ఆందోళనలు జరుగుతున్నాయి. వీటిని అణిచి వేయాలని అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. షికాగోలో నేరాలను ఎక్కువగా ఉన్నాయని మాట్లాడుతూనే ఉన్నారు. కానీ షికాగో మేయర్‌ బ్రాండన్‌ జాన్సన్‌, ఇల్లినోయీ గవర్నర్‌ జేబీ ఫ్రిట్కర్‌ లు ట్రంప్ ఆదేశాలను ఖండిస్తూ వచ్చారు. చివరకు నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపారు. ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అయితే అధ్యక్షుడి చర్యలను ఇల్లినాయిస్ గవర్నర్‌ జేబీ ఫ్రిట్కర్‌  మండిపడుతున్నారు. డెమోక్రటిక్ పార్టీ పాలనలో ఉన్న నగరాలకే ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను పంపించడం దారుణమని వ్యాఖ్యానించారు. 

Also Read: Azerbaijan Airlines plane crash: అవును ఆ విమాన ప్రమాదం మా వల్లే జరిగింది..అంగీకరించిన పుతిన్

Advertisment
తాజా కథనాలు