Trump Age: ట్రంప్ చాలా చిన్నోడు.. వయస్సు తప్పు.. వైట్ హౌస్ డాక్టర్ల షాకింగ్ రిపోర్ట్!

అమెరికా అద్యక్షుడు ట్రంప్ ఏజ్ చాలా చిన్నది అంటున్నారు వైట్ హౌస్ డాక్టర్లు. ట్రంప్ వయసు 79 కావచ్చు కానీ ఆయన గుండె మాత్రం దాని కంటే 14 ఏళ్ళు చిన్నదని చెబుతున్నారు.  అధ్యక్షుడు ఆరోగ్యానికి ఏం ఢోకా లేదని రిపోర్ట్ ఇస్తున్నారు.

New Update
Trump issues warning for Israel after ceasefire violations

Trump issues warning for Israel after ceasefire violations

ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏజ్ , ఆరోగ్యం గురించి చాలా వార్తలు వచ్చాయి. ఆయనకు గుండెకు సంబంధించిన వ్యాధి ఉందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే తరువాత అవి నెమ్మదించాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా వైట్ హౌస్ డాక్టర్లు ట్రంప్ ఆరోగ్యంపై చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. అధ్యక్షుని వయసు 79 అయినా ఆయన గుండె మాత్రం 14ఏళ్ళు చిన్నదని వైట్ హౌస్ డాక్టర్లు సర్టిపికేట్ ఇచ్చారు. వౌట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బబెల్లా ట్రంప్ కు గుండె పరీక్షలు నిర్వహించి రిపోర్ట్ ఇవ్వగా..ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ దీనిని విడుదల చేశారు. ట్రంప్ హృదయం, ఊపిరితిత్తుల, నాడీ సంబంధిత, మొత్తం శరీరం పనితీరు అన్నీ అద్భుతమైన స్థితిలో ఉన్నాయి అని డాక్టర్ బార్బబెల్లా నివేదికలో రాశారు. అధ్యక్షుడు తన రాబోయే అంతర్జాతీయ ప్రయాణానికి ముందు అవసరమైన ఆరోగ్య పరీక్షలు, వార్షిక ఫ్లూ వ్యాక్సిన్ , COVID-19 బూస్టర్ టీకాలను కూడా పొందారని తెలిపారు. 

ఆయన ఏజ్ కంటే గుండె చిన్నది..

ఇక అన్నింటి కంటే ముఖ్యంగా ఏవైతే రూమర్లు వచ్చాయో దీఆని మీద ప్రత్యేకంగా రిపోర్ట్ ఇచ్చారు వైట్ హౌస్ డాక్టర్. ట్రంప్ వయసు దాదాపు ఆయన ఏజ్ కంటే 14 ఏళ్ళు చిన్నదని ఈసీజీ పరీక్షలో తేలిందని చెప్పారు. ఇది ఒక్కటి చాలు ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పడానికి అని తెలిపారు. ట్రంప్ వైద్య పరీక్ష వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ (బెథెస్డా, మేరీల్యాండ్)లో జరిగింది. ఇక్కడే అమెరికా అధ్యక్షులను పరీక్ష చేస్తారు. లాస్ట్ టైమ్ ఏప్రిల్ లో ట్రంప్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ ఆరు నెలల తర్వాత ఇప్పుడు చేశారు. ఏప్రిల్లో వచ్చిన  నివేదిక ప్రకారం.. ట్రంప్ 6 అడుగుల 3 అంగుళాలు  పొడవు తో 224 పౌండ్ల (సుమారు 102 కిలోలు) బరువు కలిగి ఉన్నారు.  ఆయన కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంది. ఆ సమయంలో వైద్యులు కూడా ట్రంప్ ఫిట్‌నెస్,  క్రమం తప్పకుండా గోల్ఫ్ ఆడే అలవాట్లను ప్రశంసించారు.

అసలు ట్రంప్ మొదట నుంచీ తన ఆరోగ్యాన్ని పెద్ద ఆయుధంగా వాడుకుంటూ వస్తున్నారు. ఎన్నికల ముందు తనను ఎన్నుకోవడానికి తన ఆరోగ్యమే పెద్ద విషయమని చెప్పుకున్నారు. బైడెన్ ఆరోగ్యాన్ని చూపిస్తూ...తాను అలా లేనని..అందుకే తనను అధ్యక్షుడిని చేయాలని మాట్లాడారు. బైడెన్ కంటే శక్తివంతంగా ఉన్నానంటూ చెప్పుకున్నారు. 

Also Read: Rashmika: రష్మిక చేతికి పెద్ద డైమండ్ ఉంగరం..ఎంగేజ్ మెంట్ నిజమే అంటున్న అభిమానులు

Advertisment
తాజా కథనాలు