Trump On Nobel Prize: నా గౌరవం కోసమే తీసుకున్నారు...నోబెల్ బహుమతిపై మాట్లాడిన ట్రంప్

మరియా తన గౌరవార్థమే నోబెల్ బహుమతిని స్వీకరించారని అమెరికా అధ్యక్షుడు ట్రంపం చెప్పారు. ఆమెతో తాను ఫోన్ లో మాట్లాడానని..అభినందనలు తెలిపానని చెప్పారు. మరియాకు అన్ని విధాలా తాను తోడుంటానని ట్రంప్ తెలిపారు. 

New Update
nobel (1)

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఎన్నో ఆశలు పెట్టుకున్న నోబెల్ బహుమతి రాలేదు. వెనుజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదోకు ఇచ్చారు. దీనిపై ట్రంప్ మొట్టమొదటి సారిగా మాట్లాడారు.  మరియా కు నోబెల్ బహుమతి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆమెతో ఫోన్ లో మాట్లాడానని చెప్పారు. తన గౌరవార్థమే నోబెల్ బహుమతిని స్వీకరించానని మరియా చెప్పారని ట్రంప్ తెలిపారు. శాంతి బహుమతికి మీరు అన్ని విధాలా అర్హులని మరియా చెప్పారన్నారు. మరోవైపు మరియా నిజంగానే నోబెల్ కు అర్హురాలని ట్రంప్ చెప్పారు. విపత్తు సమయంలో వెనెజులాలో ప్రజలకు ఆమె ప్రజలకు సాయం చేశారని కొనియాడారు. మరియాకు తాను తోడున్నానని..ఇకపై కూడా ఉంటానని ట్రంప్ చెప్పుకొచ్చారు. 

సోషల్ మీడియాలో కీలక ప్రకటన..

నోబెల్ బహుమతి అనౌన్స్ చేగానే మరియా కొరీనా తన సోషల్ మీడియా ఖాతాలో కీలక ప్రకటన చేశారు. ఈ పురస్కారాన్ని వెనెజువెలా ప్రజలతో సహా తమ ఉద్యమానికి సపోర్ట్‌గా ఉంటున్న ట్రంప్‌కు ఈ బహుమతిని అంకితం చేస్తున్నానని రాసుకొచ్చారు.  వెనెజువెల ప్రజలు పడుతున్న కష్టాలు గుర్తించడం మా పోరాటాన్ని ముగించేందుకు ఊతమిస్తుంది. స్వేచ్ఛకు దోహదపడుతుంది. మేము విజయానికి చేరువలో ఉన్నాం. గతంలో ఎప్పడూ లేనంతగా ట్రంప్, అమెరికా, లాటిన్ అమెరికా దేశాల ప్రజలపై ఆధారపడుతాం. ప్రజాస్వామ్య దేశాలు మాకు ప్రధాన మిత్ర దేశాలు. ఈ పురస్కారాన్ని కష్టాల్లో ఉన్న వెనెజువెల ప్రజలతో సహా మా మా పోరాటానికి సపోర్ట్ చేస్తున్న అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ నోబెల్ బహుమతిని అంకితం చేస్తున్నానని'' మరియా తెలిపారు.  

Also Read: US-China Trade War: అమెరికా, చైనాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం..100 శాతం సుంకాలు 

Advertisment
తాజా కథనాలు