Madhya Pradesh : అంబులెన్స్ టైర్ పంక్చర్.. రోగి మృతి!
అత్యవసర చికిత్స కోసం ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలిస్తున్న రోగి అంబులెన్స్ టైర్ పంక్చర్ కావడంతో మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటుచేసుకుంది.
అత్యవసర చికిత్స కోసం ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలిస్తున్న రోగి అంబులెన్స్ టైర్ పంక్చర్ కావడంతో మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని బీఎన్ రెడ్డి నగర్లోప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తరలిస్తున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా అడ్డగించి.. డ్రైవర్‌పై దాడి చేశారు దుండగులు. అంబులెన్స్‌లో రోగి ఉన్నా కూడా ఆ దుండగులు దాదాపు అరగంట పాటు వాహనాన్ని నిలిపివేశారు.
నాల్గవ అంతస్తు నుండి పడినప్పటికీ రెండేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ 5 గంటల పాటు ట్రాఫిక్ జామ్ మూలంగా అతని ప్రాణాలు పోయిన విషాద ఘటన అందరినీ కలిచివేసింది. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లు ప్రధాన సమస్యగా మారుతున్నాయి.
భారత్‌కు త్వరలోనే నిటారుగా టైకాఫ్, ల్యాండయ్యే ఎయిర్ అంబులెన్స్‌లు రానున్నాయి. ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ స్టార్టప్ ఇ ప్లేన్ అనే కంపెనీ వీటిని తయారు చేయనుంది. దీనికోసం తాజాగా 1 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం కూడా చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబును సినీ నటుడు సోనూసూద్ కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా నాలుగు అంబులెన్స్‌లను ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ అందించారు. అనంతరం నాలుగు అంబులెన్స్‌లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ నలుగురి ప్రాణాలు తీసింది. అనిష్ షా అనే రోగిని కర్నూలు నుంచి తన సొంత గ్రామం బిహార్‌లోని చంపారన్‌కు తరలిస్తుండగా జబల్పుర్ -నాగ్‌పుర్ హైవే ఓ పాదాచారున్ని ఢీకొట్టి బోల్తా పడింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు.
కేంద్రమంత్రి సురేష్ గోపిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారుతాజాగా నిర్వహించిన ఓ ఉత్సవానికి ఆయన అంబులెన్స్‌లో వచ్చారని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బెంగళూర్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. సిగ్నల్ జంప్ ఫైన్ నిబంధనల్లో కొత్త మార్పులు చేసినట్లు తెలిపారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే జరిమానా విధించమని స్పష్టం చేశారు. ఒకవేళ ఫైన్ పడితే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు.
108 సిబ్బంది నిజాయితి చాటుకున్నారు. తిరుపతయ్య అనే వ్యక్తి ఎర్రగడ్డ బ్రిడ్జి మీద బైకుపై నుంచి అదుపుతప్పి పడిపోగా.. సమాచారం అందుకుని ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుడి దగ్గర దొరికిన రూ:68,500, ఫోన్, బైక్ బంధువులకు అందించి వెంకటేష్, వెంటకరమణలు ప్రశంసలు అందుకుంటున్నారు.