Sonusood : ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్‌.. ఎందుకంటే!

ఏపీ సీఎం చంద్రబాబును సినీ నటుడు సోనూసూద్‌ కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్‌ ఫౌండేషన్‌ ద్వారా నాలుగు అంబులెన్స్‌లను ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్‌  అందించారు. అనంతరం నాలుగు అంబులెన్స్‌లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.  

New Update
chandrababu, sonusood

chandrababu, sonusood

ఏపీ సీఎం చంద్రబాబును సినీ నటుడు సోనూసూద్‌  ఫిబ్రవరి 03వ తేదీ సోమవారం రోజున సచివాలయంలో  కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్‌ ఫౌండేషన్‌ ద్వారా నాలుగు అంబులెన్స్‌లను ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్‌  అందించారు. అనంతరం నాలుగు అంబులెన్స్‌లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.  

ఆరోగ్య సంరక్షణలో విషయంలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని.. ఈ విషయంలో సోనూసూద్‌ ఫౌండేషన్ భాగస్వామి అయినందుకు సీఎం చంద్రబాబు ఆయనకు అభినందనలు తెలిపారు. అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తరలించేందుకు, సుదూర ప్రాంతాల్లో క్లిష్టమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా అంబులెన్సులు ఇచ్చిన సోనూసూద్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. 

ఆపదలో ఉన్నవారికి భరోసా

అనంతరం మీడియాతో మాట్లాడిన సోనూసూద్‌ ..తెలుగు ప్రజలు తన గుండెల్లో  ఉంటారని తెలిపారు. తెలుగు ప్రజలు తనని మంచి నటుడిగా  తయారు చేశారని అందుకూ  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి  జరుగుతోందన్న సోనూసూద్‌ .. ఈ రోజు తమ  ట్రస్ట్  తరపున నాలుగు అంబులెన్స్ లను రాష్ట్ర ప్రభుత్వానికి  అందించామని తెలిపారు.  కోవిడ్  టైమ్ లో తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసానని..  అప్పుడే తనపై తెలుగు  ప్రజలు ప్రేమ  చూపించారని వెల్లడించారు. ఇప్పుడు తాము అందించిన అంబులెన్సులతో ఆపదలో ఉన్నవారికి భరోసా లభిస్తుందని సోనూసూద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also read :  అలా రేప్ చేస్తే తప్పుకాదు.. వీర్యం పట్టించిన కేసులో కోర్టు సంచలన తీర్పు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు