Hyderabad Crime News
అంబులెన్స్ అనేది అత్యవసర వైద్య సేవలను (EMS) అందించేందుకు.. రోగులను లేదా ప్రమాద బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి త్వరగా తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక వాహనం. ఇది కేవలం రవాణా సాధనం మాత్రమే కాదు.. లోపల ఫస్ట్ ఎయిడ్ కిట్, స్ట్రెచర్, ఆక్సిజన్ సిలిండర్, వెంటిలేటర్ వంటి కీలకమైన ప్రాణరక్షక పరికరాలు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగికి దారిలోనే స్థిరీకరణ చికిత్స అందించడానికి శిక్షణ పొందిన పారామెడికల్ సిబ్బంది ఎల్లప్పుడూ అంబులెన్స్‌లో అందుబాటులో ఉంటారు. సైరన్, మెరుస్తున్న లైట్ల సహాయంతో.. రద్దీగా ఉండే రోడ్ల మీద కూడా ఇది వేగంగా దూసుకుపోతుంది. సమయానికి సహాయం అందించి ప్రాణాలను కాపాడుతుంది. ఆపదలో ఉన్నవారికి అంబులెన్స్ ఎంతగానో సహాయం చేస్తుంది.
అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా..
అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తరలిస్తున్న అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వకుండా అడ్డగించి, డ్రైవర్‌పై దాడి చేసిన దుండగుల దారుణం వెలుగులోకి వచ్చింది. బీఎన్ రెడ్డి నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. స్థానిక సమాచారం ప్రకారం.. కోఠి ఆసుపత్రి నుంచి ఓ చిన్నారిని ఇంటికి తీసుకువెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్ దారి ఇవ్వాల్సిందిగా అడ్డంగా ఉన్న కొందరు యువకులను కోరాడు. అయితే అంబులెన్స్‌లో రోగి ఉన్నా కూడా ఆ దుండగులు దాదాపు అరగంట పాటు వాహనాన్ని నిలిపివేశారు.
ఇది కూడా చదవండి: మనసును కలచివేసే ఘటన... అనంతపురంలో వేడి పాల గిన్నెలో పడి బాలిక మృతి
అంతేకాకుండా వారు అక్కడ ఆగకుండా.. అంబులెన్స్ డ్రైవర్, సెక్యూరిటీ గార్డుపై అనుచితంగా ప్రవర్తించారు. డ్రైవర్‌ను దారుణంగా కొట్టి.. అతడి కాళ్లను పట్టుకుని ముద్దు పెట్టుకోవడంతో సహా అసభ్యకరంగా.. అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. ఈ దుశ్చర్యతో రోగుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే ఇలాంటి ఘటనలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ వివరణ ఇస్తూ ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామని కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. ప్రజల భద్రత కోసం అంబులెన్స్‌లకు దారి ఇవ్వడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని వైద్య వర్గాలు హెచ్చరించాయి.
ఇది కూడా చదవండి: ఒరేయ్ దుర్మార్గుడా.. అందుకు ఒప్పుకోలేదని మాజీ లవర్‌ను స్కూటీతో ఢీకొట్టి..