Air Ambulance: గుడ్‌న్యూస్‌.. భారత్‌కు త్వరలో వర్టికల్‌ టేకాఫ్‌ ఎయిర్‌ అంబులెన్సులు

భారత్‌కు త్వరలోనే నిటారుగా టైకాఫ్‌, ల్యాండయ్యే ఎయిర్‌ అంబులెన్స్‌లు రానున్నాయి. ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ స్టార్టప్ ఇ ప్లేన్ అనే కంపెనీ వీటిని తయారు చేయనుంది. దీనికోసం తాజాగా 1 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం కూడా చేసింది.

New Update
Air Ambulance

Air Ambulance

ప్రపంచంలో టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. అయితే మన భారత్‌కు త్వరలోనే నిటారుగా టైకాఫ్‌, ల్యాండయ్యే ఎయిర్‌ అంబులెన్స్‌లు రానున్నాయి. దీనికి రన్‌వే కూడా కూడా అవసరం లేదు. ఇలాంటి వర్టికల్ టేకాఫ్‌ ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలు ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో భారత్‌ కూడా చేరనుంది. ఐఐటీ మద్రాస్‌ ఆధారితమైన ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ స్టార్టప్ ఇప్లేన్ అనే కంపెనీ వీటిని తయారు చేయనుంది. దీనికోసం తాజాగా 1 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం కూడా చేసింది. 

Also Read:  'చైనాను శత్రువులా చూడొద్దు'.. శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్

ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్‌లో ఐసీఏటీటీ సంస్థ ఎయిర్‌ అంబులెన్స్ సేవలు అందిస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీ తాజాగా ఇప్లేన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 788 ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్,ల్యాండిగ్ ఎయిర్‌ అంబులెన్సులు సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటిని దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా అందుబాటులో ఉంచాలని ఐసీఏటీటీ భావిస్తోంది. 2026 చివరి త్రైమాసికం నాటికి ఎయిర్‌ అంబులెన్సులను అందించాలని ఇ ప్లేన్ సంస్థ లక్ష్యం పెట్టుకుంది. 

Also Read: ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..?

వేరు వేరు జనసాంద్రత, భౌగోళిక ప్రదేశాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగానే 3 రకాల ప్రొటోటైప్‌లను ఇప్లేన్‌ తయారు చేయనుంది. అయితే ఈ ఎయిర్ అంబులెన్సులో ఒక పైలట్, పారామెడిక్, పేషెంట్, స్ట్రెటర్ అలాగా అత్యవసర మందులు ఉంటాయి. అంతేకాదు ఈ అంబులెన్సులు ఏకంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. సింగిల్‌ ఛార్జ్‌తోనే 110 నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి.  

Also Read: రైల్వే స్టేషన్‌తో తొక్కిసలాట.. బిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేసిన మహిళా కానిస్టేబుల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు