Allu Arjun: ఇది మతిలేని చర్య.. అల్లు అర్జున్ కేసుపై న్యాయమూర్తి సీరియస్
అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే.కృపాసాగర్ ఈ కేసును కొట్టి వేశారు. ఇలాంటి ఘటనలో కేసు నమోదు చేయడం మతిలేని చర్య అవుతుందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నాడు.