Pushpa2 : బన్నీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. 'పుష్ప 2' మళ్ళీ వాయిదా?

'పుష్ప 2' మళ్లీ వాయిదా పడింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటమే అని తెలుస్తోంది. సినిమాకు సంబంధించి యాక్షన్ సీక్వెన్స్, ఓ సాంగ్ షూట్ చేయాల్సి ఉందట. అందుకే సినిమా రిలీజ్ మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం.

author-image
By Anil Kumar
New Update
pp2 (1) .jpg

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2' ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ సినిమాను డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేశారు మేకర్స్. 

ఇటీవలే బిహార్ వేదికగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ తో పాటు ట్రైలర్‌‌తో పుష్ప 2 సినిమాపై క్రేజ్‌ మరింత పెరిగింది.ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా 'పుష్ప 2' సినిమా మళ్లీ వాయిదా పడింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటమే అని తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.. ఏకంగా తెలుగు సినిమాలోనే?

రిలీజ్ మరింత ఆలస్యం..

సినిమా రిలీజ్ కు ఇంకా రెండు వారాలు కూడా లేనప్పటికీ 'పుష్ప2' కు సంబంధించి ఇంకా వై యాక్షన్ సీక్వెన్స్ తో పాటూ ఓ సాంగ్ కూడా షూట్ చేయాల్సి ఉందట. ఇవి పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యే వరకు కనీసం మూడు వారాలకు పైగా సమయం పట్టే ఛాన్స్ ఉంది. అందుకే సినిమా రిలీజ్ మరింత ఆలస్యం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 19 న 'పుష్ప2' రానుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

ఈ న్యూస్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. జగపతి బాబు, రావు రమేష్, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీలీల స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.

ఇది కూడా చదవండి: మళ్లీ యాక్టివ్ అయిన కవిత.. జాగృతి నాయకులతో కీలక సమావేశం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు