అల్లు అర్జున్‌కు రేవంత్ థాంక్స్.. పుష్ప ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!

అల్లు అర్జున్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి థాంక్స్ చెప్పారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వీడియో చేయడంతో అల్లు అర్జున్‌ను అభినందించారు. డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. 

New Update

పుష్ప స్టార్‌ అల్లు అర్జున్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వీడియో చేయడంతో అల్లు అర్జున్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరోకు కాల్‌ చేయాలంటూ ఆ వీడియో బన్నీ సందేశం ఇచ్చాడు.

ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!

బన్నీని అభినందించిన సీఎం

దీంతో బన్నీ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి బన్నీని అభినందించారు. డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. 

Also Read: అప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇప్పుడు బిచ్చగాడు, ఎందుకు అలా?

ఇకపోతే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్కటీ బజ్ క్రియేట్ చేసింది. ఇటీవలే విడుదలైన ‘కిస్సిక్’ సాంగ్ ఫుల్ రెస్పాన్స్ అందుకుంది. 

అలాగే ఇవాళ ఈ సినిమా నుంచి మేకర్స్ ప్రోమో రిలీజ్ చేశారు. ‘పీలింగ్స్’ అంటూ సాగే ఈ ప్రోమో సాంగ్ కూడా సూపర్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాపై నెగిటివ్ టాక్ తెప్పించేందుకు కొందరు పూనుకున్నారు.

ఎలాగైనా ఈ సినిమాని ఏపీలో ఆడనియ్యకుండా చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సినిమాపై నెగిటివ్ టాక్ తెప్పించాలని ఇటీవల ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న ఆడియో బయటకొచ్చింది. చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అనంతరం ఎలాంటి టాక్ అందుకుంటుందో. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు