Pushpa2 : రికార్డ్స్ లో తగ్గేదేలే.. 'పుష్ప2' మరో అరుదైన ఘనత

అల్లు అర్జున్ 'పుష్ప2' ట్రైలర్ మరో ఘనత సాధించింది. 'పుష్ప2' ట్రైలర్ అతి తక్కువ సమయంలోనే 150 మిలియన్‌కి పైగా వ్యూస్‌, 3 మిలియన్‌కి పైగా లైక్స్‌ సాధించింది. ప్రస్తుతం.. యూట్యూబ్‌ (ఇండియా) ట్రెండింగ్‌ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది.

New Update

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2'. ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకొని మరింత హైప్ పెంచింది. ఇదంతా ఒకెత్తయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. 

ముఖ్యంగా 'పుష్ప2' ట్రైలర్ ఆడియన్స్ లో అనూహ్య స్పందన రాబట్టింది. ఇప్పటికే 42 మిలియన్ వ్యూస్ తో రిలీజైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ అందుకున్న ట్రైలర్ గా  సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయగా.. తాజాగా మరో ఘనత సాధించింది. 'పుష్ప2' ట్రైలర్ అతి తక్కువ సమయంలోనే 150 మిలియన్‌కి పైగా వ్యూస్‌, 3 మిలియన్‌కి పైగా లైక్స్‌ సాధించింది. 

Also Read :  ఏదో తప్పు జరిగింది.. మహారాష్ట్ర ఎన్నికలపై సంజయ్‌ రౌత్ సంచలన వ్యాఖ్యలు

ఇండియా వైడ్ ట్రెండింగ్..

ప్రస్తుతం.. యూట్యూబ్‌ (ఇండియా) ట్రెండింగ్‌ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది.  దీనికి సంబంధించిన పోస్టర్‌ పంచుకుంటూ చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ సినిమా నుంచి ఐటం సాంగ్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

'కిస్సిక్' అంటూ ఈ సాంగ్ రాబోతుండ‌గా.. తాజాగా ఈ పాట‌కు సంబంధించిన ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ ఐటెం సాంగ్ లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల బన్నీతో కలిసి స్టెప్పులేయనుంది. ఫుల్ సాంగ్‌ను న‌వంబ‌ర్ 24న‌ రాత్రి 7:02 గంటలకు విడుద‌ల చేయ‌నున్నారు.

Also Read :  బీజేపీకి బిగ్ షాక్.. ఝార్ఖండ్‌లో గెలుపు దిశగా ఇండియా కూటమి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు