Pushpa 2: పుష్ప 2 సినిమా మొత్తం లైవ్‌లో పెడతా.. ఆడియో లీక్..! పుష్ప-2 ది రూల్ మూవీ లీక్‌కు కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమా బాలేదని ప్రచారం చేయాలని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న ఆడియో లీక్ అయింది. VPNతో ఐపీ అడ్రస్ ఎవరికి దొరకదని.. సినిమా మొత్తం లైవ్‌లో పెడతానంటూ ఆడియోలో వినిపిస్తుంది. By Seetha Ram 28 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2’. అందరి కళ్లు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉన్నాయి. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించారు. డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. Also Read : పంత్‌కు రూ.27 కోట్లు కాదు రూ.15 కోట్లే.. ఎలాగంటే! ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఎలాగైనా ఈ చిత్రంపై నెగిటివ్ రెస్పాన్స్ తెప్పించాలని చాలా మంది చూస్తున్నట్లు ఇప్పటికే పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. Also Read: అఖిల్ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు! ఆడియో లీక్‌లో ఏముంది? ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆడియో లీక్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుష్ప2 సినిమాను ఎలాగైనా దెబ్బ కొడదాం అనే రీతిలో ఆ ఆడియో ఉండటం గమనార్హం. ఇద్దరు వ్యక్తులు ఫోన్‌లో పుష్ప 2 గురించి మాట్లాడుకున్న ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. దాని ప్రకారం.. సినిమా బాలేదని ప్రచారం చేయాలని ఇద్దరూ మాట్లాడుకున్నారు. Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా? VPNతో ఐపీ అడ్రస్ ఎవరికి దొరకదని.. సినిమా మొత్తం లైవ్‌లో పెడతానంటూ ఆడియోలో వినిపిస్తుంది. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ చిర్రెత్తిపోతున్నారు. ఈ మేరకు స్ట్రాంగ్‌గా బన్నీ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. పుష్ప 2 సినిమాని అడ్డుకోవడం ఎవరి తరం కాదని అంటున్నారు. కాగా ఇప్పటికే సోషల్ మీడియాలో మెగా, అల్లు వర్గాల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ఆడియో ఏ వర్గానికి చెందినది అన్న విషయం త్వరలో తెలియాల్సి ఉంది. Also Read: నన్ను అరెస్టు చేయాలని చూస్తే.. RGV షాకింగ్ ట్వీట్ ఇక సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ ఇలా ప్రతీ ఒక్కటీ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో బన్నీ మాస్ యాక్షన్, డైలాగ్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. అలాగే సాంగ్స్ కూడా ఊరమాస్‌గా ఉండటంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని తహతహలాడుతున్నారు. చూడాలి మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో. #allu-arjun #sukumar #pushpa-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి