Allu Arjun: మెగా ఫ్యాన్స్ కు కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్! మెగా ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు గట్టిగా సమాధానాలు చెబుతూ వస్తున్నాడు అల్లు అర్జున్. తాజాగా అన్‌స్టాపబుల్ షోలో మరోసారి మెగాఫ్యాన్స్‌కు కౌంటర్ ఇచ్చాడు బన్నీ. ఏదో ఒక పాయింట్‌లో డిఫరెన్స్ ఉంటే అది అంతవరకే...మొత్తం రిలేషన్ కి కాదు అంటూ చురకలంటించాడు. By Manogna alamuru 22 Nov 2024 | నవీకరించబడింది పై 22 Nov 2024 20:13 IST in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Allu Arjun In Unstopable Show ఆహాలో ప్రసారమవుతున్న బాలయ్య అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. సాధారణంగా ఇందులో ఎవరు వచ్చినా అది సూపర్ హిట్ అవుతుంది. బాలయ్య అడిగే ప్రశ్నలు, అతిధులు ఇచ్చే సమాధానాలు అన్నీ ఓ లెవల్ లో ఉంటాయి. చాలా సరదాగా...అంతే సూటిగా సాగే ఈ షోకు రీసెంట్‌గా అల్లు అర్జున్ వచ్చాడు. ఇందులో బన్నీ చెప్పిన ప్రతీ విషయం సెన్సేషనల్ అవుతున్నాయి. ఆహాలో బన్నీతో ఏసిన అన్‌స్టాపబుల్ ఇంకా ప్రసారం కాలేదు. కానీ ప్రోమోలు కింద వదులుతున్న ఒక్కో వీడియో మాత్రం బుల్లెట్లలా దూసుకెళుతున్నాయి. ఇందులో అల్లు అర్జున్ తో పాటూ వాళ్ళ అమ్మగారు, పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళకు సంబంధించిన వీడియోలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా రిలేషన్ షిప్ గురించి మాట్లాడిన బన్నీ మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్‌కు కౌంటర్ అంటూ పిచ్చపిచ్చగా ఈ వీడియో సర్క్యులేట్ అవుతోంది. Also Read: Iran: విమానాల మీద నుంచి ఇరాన్ క్షిపణులు–చూసిన పైలట్లు, ప్రయాణికులు విభేదాలు ఆ విషయం వరకే... మెగా ఫ్యాన్స్‌కు అల్లు వారసుడు మామూలుగా కౌంటర్ ఇవ్వలేదు అని చెబుతున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. అసలు ఇందులో బన్నీ ఏం చెప్పాడు అంటే. తాను రిలేషన్స్‌కు చాలా వాల్యూ ఇస్తానని..అవతలి వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తానని చెప్పాడు. దాంతో పాటూ ఇద్దరి మధ్య ఏదైనా బేధాభిప్రాయం ఉంటే అది ఆ టాపిక్ వరకే తప్పి...తమ మధ్య ఉన్న రిలేషన్ షిప్‌లోకి దాన్ని తీసుకురాను అని చెప్పుకు వచ్చాడే. ఇదంతా డిప్యూటీ సీఎం, చిన్న మావయ్య పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకునే చెప్పాడని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. తమ హీరో మెగా ఫ్యాన్స్‌కు భలే ఆన్సర్ చెప్పాడని మురిసిపోతున్నారు. Also Read: రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేకు షాక్.. రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ This is the BEST BEST BEST advice one can give E episode lo every statement spot on.... Posted by Vasu Prime Gulf Journalist on Friday, November 22, 2024 Also Read: ఒక్కసారిగా 2000 పాయింట్లు పైకెగిసిన సెన్సెక్స్..7 లక్షల కోట్ల లాభం Also Read: Iran: విమానాల మీద నుంచి ఇరాన్ క్షిపణులు–చూసిన పైలట్లు, ప్రయాణికులు #allu-arjun #unstoppable-4 #allu-arjun-vs-mega-fans #balakrishna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి