అల్లు అర్జున్ ఏమైనా హరిశ్చంద్రుడా: గరికపాటి సంచలన వ్యాఖ్యలు

‘పుష్ప2’ రిలీజ్‌కు మరికొద్ది రోజులే ఉంది. ఈ నేపథ్యంలో ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంత వరకు సమంజసం అంటూ గతంలో ‘పుష్ప’పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

New Update
Garikapati Narasimha Rao

ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంత వరకు సమంజసం. సినిమా మొత్తం స్మగ్లింగ్ చూపించి.. చివర్లో మంచిగా చూపిస్తాం అని నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి అనేది ఎంతవరకు న్యాయం. ఈ లోపు సమాజం చెడిపోవాలా? స్మగ్లింగ్ చేసే వ్యక్తి ‘తగ్గేదే లే’ అంటాడా?. ఇప్పుడదొక పెద్ద డైలాగ్ అయిపోయింది. సినిమా హీరో కానీ, దర్శకుడు కానీ దీనిపై సమాధానం చెప్తే అడిగి కడిగేస్తా. ఇదంతా నేను చెప్తున్న మాటలు కాదు.. ప్రముఖ ఆద్యాత్మిక వేత్త, ప్రవచన కర్త అయిన గరికపాటి నరసింహారావు చెప్పిన మాటలు. 

Also Read: 'మెకానిక్ రాకీ' రివ్యూ.. విశ్వక్ యాక్షన్, కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?

డిసెంబర్ 5న రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప 2’ తెరకెక్కుతోంది. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. గతంలో 2021లో ‘పుష్ప’ సినిమా రిలీజ్ టైంలో గరికపాటి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ సమయంలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్​ ఖరారు!

ఆయన మాట్లాడుతూ.. ‘‘పుష్ప సినిమాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వారిని హీరోగా చూపించారు. ఏమైనా అంటే సినిమా మొత్తం స్మగ్లింగ్‌ చూపించి.. చివర్లో మంచిగా చూపిస్తాం నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి అంటూ చెప్తారు. ఇది ఎంతవరకు న్యాయం. ఆ పార్ట్ తీసే వరకు సమాజం చెడిపోవాలా?.

Also Read: ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఇక ఆ భయం అవసరం లేదు!

రెండు, మూడు పార్టులు తీసే వరకు సమాజం చెడిపోవాలా?. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదే లే అంటాడా?. అదో పెద్ద ఉపనిషత్తు సూక్తి అయిపోయింది. ఇప్పుడు ఒక కుర్రాడు కూడా ఎవర్నో గూబపైన కొట్టి తగ్గేదే లే అంటున్నాడు. దీనికి ఎవరు కారణం. ఆ హీరోని కానీ, డైరెక్టర్‌ను కానీ తనకు సమాధానం చెప్పమనండి కడిగేస్తాను.

Also Read: కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. !

ఈ డైలాగ్ వల్ల నేరాలు పెరిగిపోయాయి

ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోయాయి. తగ్గేదే లే అని హరిశ్చంద్రలాంటి వాడు అనాలి. శ్రీరామ చంద్రుడు లాంటి వాడు అనాలి. అంతేకాని ఒక స్మగ్లర్ ఆ డైలాగ్ వాడటమేంటని’’ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు