Pushpa 2: పుష్ప2 భారీ రన్ టైం.. కంగారు పడుతున్న ఫ్యాన్స్! అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' రన్ టైం బయటకొచ్చింది. 3గంటల 15నిమిషాల రన్ టైంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి. దీంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. రన్ టైం ఎక్కువ కావడంతో సినిమా ఎలా ఉంటుందోనని కంగారు పడుతున్నారు. By Seetha Ram 26 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2'. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రన్ టైం బయటకొచ్చింది. ఈ సినిమా 3 గంటల 15 నిమిషాల రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సినీ వర్గాలు వెల్లడించాయి. కంగారులో ఫ్యాన్స్ అయితే ఈ రన్ టైం విషయంలో కొందరు ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఇంత ఎక్కువ రన్ టైం మూవీని ప్రేక్షకులు ఆదరిస్తారో? లేదో ? అని చర్చించుకుంటున్నారు. మరికొందరేమో సినిమా బాగుంటే ఎంత సమయం ఉన్నా టైమే తేలీదు అంటూ మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఈ రన్ టైం సినిమాకి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందాం? అనేది. Also Read: ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన లారీ..ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు కాగా సుకుమార్ పుష్ప 2 చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్‌కి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో సెకండ్ పార్ట్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఇక దర్శకుడు సైతం అందరి అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఎక్కడా తగ్గకుండా వ్యవహరిస్తున్నాడు. Also Read: ఫ్యాన్స్ కు లైవ్ లో నాగచైతన్య పెళ్లి చూసే అవకాశం.. ఎలాగో తెలుసా..! ఈ సినిమా పట్టాలెక్కి దాదాపు రెండేళ్లు గడుస్తుంది. కానీ ఇప్పటికీ రిలీజ్‌కు నోచుకోలేదంటే దర్శకుడు ఎంతలా మెరాకిల్ చేయబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడిప్పుడే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్‌లు వస్తున్నాయి. సాంగ్స్, పోస్టర్స్, టీజర్ ఇలా ప్రతీ ఒక్క అప్డేట్‌ను మేకర్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. Also Read: పాకిస్థాన్‌లో ఉద్రిక్తత.. కనిపిస్తే కాల్చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు రీసెంట్‌గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో నిర్వహించగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో భాగంగానే ఈ మూవీలోని ఐటెం సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ‘దెబ్బలు పడతాయ్’ అంటూ సాగే ఆ సాంగ్‌లో అల్లు అర్జున్, శ్రీలీల వేసిన మాస్ స్టెప్పులు ఫ్యాన్స్‌లో ఊపు తెప్పించాయి. Also Read: పవన్ ఇక పాన్ ఇండియా పొలిటీషియన్.. బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం! ఇక తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించుకోమని ఆదేశించింది. దీంతో త్వరలో పుష్ప 2 బృందం ఏపీకి రానుంది. #allu-arjun #sukumar #pushpa-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి