Pushpa2: 'కిస్సిక్' కోసం అన్ని కోట్లా.. స్వయంగా చెప్పిన శ్రీలీల! పుష్ప2 ఐటమ్ సాంగ్ 'కిస్సిక్' కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల కేవలం ఈ ఒక్క పాట కోసం రూ. 2కోట్ల పారితోషకం తీసుకుందట. ఈ రెమ్యునరేషన్ ఆమె సినిమా చేయడానికి తీసుకునే మొత్తం రెమ్యునరేషన్ తో సమానమని టాక్. By Archana 27 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update KISSIK song Sreeleela షేర్ చేయండి Sreeleela Kissik song: ఈ మధ్య సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ కోసం స్టార్ హీరోయిన్లను ఎంపిక చేయడం ట్రెండ్ అయ్యింది. దీని కోసం నిర్మాతలు కూడా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్లు ఒక్క సాంగ్ చేయడానికి కోట్లలో డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా పుష్ప2 నుంచి విడుదలైన స్పషల్ సాంగ్ 'కిస్సిక్' కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంది. Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! ఈ ఒక్క పాట కోసం రూ. 2కోట్ల శ్రీలీల కేవలం ఈ ఒక్క పాట కోసం రూ. 2కోట్ల పారితోషకం తీసుకుందట. ఈ సాంగ్ కోసం ఈ యంగ్ బ్యూటీ ఛార్జ్ చేసిన రెండు కోట్లు ఆమె మొత్తం సినిమా చేయడానికి తీసుకునే రెమ్యునరేషన్ తో సమానం. ఒక సినిమా చేస్తే వచ్చే డబ్బులు ఒక సాంగ్ తో సంపాదించేసింది. కెరీర్ స్టార్టింగ్ లో వరుస సినిమాలతో ఊపేసిన శ్రీలీల కెరీర్ ఇప్పుడు కాస్త డల్ అయ్యింది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న పుష్ప2 శ్రీలీల స్పెషల్ సాంగ్ చేయడం ఆమె కెరీర్ లో ఎంతో కీలకం అనే చెప్పాలి. ముందుగా ఈ సాంగ్ కోసం మేకర్స్ బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ ని సంప్రదించారట. అయితే ఆమె ఈ ఒక్క సాంగ్ కోసం 6 కోట్లు డిమాండ్ చేయడంతో మేకర్స్ లైట్ తీసుకున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే పార్ట్ 1లో 'ఊ అంటావా మావ. ఊఊ అంటావా’ వరల్డ్ వైడ్ గా ఎంత పాపులరైందో తెలిసిందే. అప్పట్లో ఈ సాంగ్ ఓ ఊపు ఊపేసింది. దీంతో పార్ట్2 ఐటమ్ సాంగ్ పై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ ఆదివారం విడుదలైన ఈ ‘కిస్సిక్’ సాంగ్ అభిమానులను కాస్త డిసప్పాయింట్ చేసింది. 'ఊ అంటావా మావ. ఊఊ అంటావా’ అంచనాలను రీచ్ కాలేకపోయింది. Also Read: రిలీజైన 15 రోజులకే ఓటీటీలో నిఖిల్ సినిమా..మూవీ పేరేంటో తెలుసా..? Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? Also Read: రిలీజైన 15 రోజులకే ఓటీటీలో నిఖిల్ సినిమా..మూవీ పేరేంటో తెలుసా..? #allu-arjun #pushpa2 #kissik #sreeleela మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి