Delhi International Airport: ఎయిర్పోర్ట్లో 20 Kgల గంజాయి కలకలం
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 20 కిలోల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోటి రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.