Operation Sindoor : శ్రీనగర్ సహా 5 ఎయిర్‌పోర్టులు మూసివేత

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు, ప్రతిగా సరిహద్దుల్లో పాక్‌ రేంజర్ల కాల్పుల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎయిర్‌ పోర్టును మూసివేశారు. ఇరుదేశాల సరిహద్దుల్లోని మరో ఐదు ఎయిర్‌ పోర్టులను కూడా క్లోజ్‌చేశారు.

New Update
Srinagar airport

Srinagar airport

Operation Sindoor :  పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు, ప్రతిగా సరిహద్దుల్లో పాక్‌ రేంజర్ల కాల్పుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎయిర్‌ పోర్టును మూసివేశారు. అటు ఇరుదేశాల సరిహద్దుల్లోని జమ్మూ, అమృత్‌సర్‌, లేహ్‌, చండీగఢ్‌, ధర్మశాల ఎయిర్‌ పోర్టులను కూడా క్లోజ్‌చేశారు. వీటి గుండా రాక పోకలు సాగించే విమానాల ఆపరేషన్స్‌ను నిలిపివేస్తున్నట్లు ఇండిగో ఓ ప్రకటన విడుదల చేసింది.


విద్యాసంస్థల మూసివేత


కాగా పాక్‌, భారత్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో  జమ్మూ కశ్మీర్‌లో విద్యా సంస్థల మూసివేశారు.ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో అధికారుల నిర్ణయం తీసుకున్నారు.కాగా నియంత్రణ రేఖ వద్ద పాక్‌ కాల్పులకు భారత్‌ సైన్యం తగిన బుద్ది చెప్పింది. నియంత్రణ రేఖ వెంబడి ఫిరంగులతో  పాక్‌ దాడులకు పాల్పడుతోంది.భారత్‌ ప్రతిదాడులు జరపడంతో పాక్‌ సైన్యంలో మరణాలు సంభవించినట్లు సమాచారం. ఆఫరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరా తీశారు.

యూఎన్‌ భద్రతా మండలికి సమాచారం అందించిన పాక్


భారత దాడులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి  పాక్‌ సమాచారం అందించింది.అంతర్జాతీయ శాంతి, భద్రతలకు భారత్‌ విఘాతం కలిగిస్తోందంటూ పాక్‌ విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి పేర్కొన్నారు. సరైన సమయంలో, సరైన ప్రాంతంలో తగిన విధంగా స్పందించే హక్కు తమకు ఉందని యూఎన్‌ భదత్రా మండలికి పాక్‌  తెలిపింది.

Advertisment
తాజా కథనాలు