/rtv/media/media_files/2025/08/06/air-ports-2025-08-06-09-24-39.jpg)
Indian Air ports
భారత్ కు అన్ని వైపుల నుంచీ ఉగ్ర ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విమానాశ్రయాల మీద ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎయిర్ పోర్ట్ ల మీద ఉగ్ర దాడులు జరుగుతాయని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. దీంతో అన్ని ఎయిర్ పోర్ట్ లకు హై అలెర్ట్ ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్యలో దాడులు జరగవచ్చని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీంతో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని ఎయిర్‌పోర్టులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాశ్రయాల్లో వెంటనే భారీ భద్రతను ఏర్పాటు చేయాలని సూచించింది. రన్‌వేలు, హెలిప్యాడ్స్, ఫ్లైయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో కట్టుదిట్టమై భద్రత పెంచాలని చెప్పింది.
भारत के सभी एयरपोर्ट अधिकतम सुरक्षा अलर्ट पर रखा गया है। केंद्रीय खुफिया एजेंसियों ने आतंकवादी हमले को लेकर अलर्ट जारी किया है। यह चेतावनी 22 सितंबर से 2 अक्टूबर 2025 के बीच के लिए है। #IndianAirports#terroristattack
— Hindustan (@Live_Hindustan) August 6, 2025
यहां पढ़ें पूरी खबर - https://t.co/TZ0ZLoraGXpic.twitter.com/3ds78TeA3z
ఎయిర్ పోర్ట్ ల దగ్గర కట్టుదిట్టమైన భద్రత..
కేద్ర విమానయాన భద్రతా బ్యూరో ఆదేశాల మేరకు ఎయిర్ పోర్ట్ దగ్గర భద్రతను పెంచారు. టర్మినల్స్, పార్కింగ్, పెరీ మీటర్ జోన్ ఇలా అన్ని చోట్లా పెట్రలింగ్ ను కట్టదిట్టం చేశారు. ప్రతీ ఇంచును అనుక్షణం తనిఖీలు చేసే ఏర్పాట్లు చేశారు. దాంతో పాటూ స్థానిక పోలీసుల సహాయంతో ఎయిర్ పోర్ట్ కు వచ్చే వాహనాల తనిఖీకి కూడా ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో పంపే మెయిల్ పార్సిళ్లను క్షుణ్ణంగా సోదా చేస్తున్నారు. సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్స్‌ను కూడా తనిఖీలు చేయాలని నిర్ణయించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే యాక్షన్ తీసుకోనున్నారు. అవసరమైతే మాక్ డ్రిల్స్ ను కూడా చేపట్టాలని అధికారులు సూచించారు.
నిన్న దేశ రాజధానిలో జరిగిన సంఘటన కూడా కలవపరిచేదిగా ఉంది. ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు బంగ్లా వాసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అక్రమ వలసదారులని తేల్చారు పోలీసులు. వారు ఎర్రకోట ప్రాంగణంలోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించారని తెలిపారు. వారందరి వయస్సు దాదాపు 20-25 సంవత్సరాలు ఉంటుంది, వారు ఢిల్లీలో కార్మికులుగా పనిచేస్తున్నారని, వారి నుండి కొన్ని బంగ్లాదేశ్ పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా భారత్‌లోకి ప్రవేశించారని తెలుస్తోంది. ఇందులో కూడా ఉగ్ర కోణం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు బోర్డర్ లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఫూంచ్ సెక్టార్ లో దాదాపు 15 నిమిషాల పాటూ పాక్ కాల్పులు చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం అందింది. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఎయిర్ పోర్ట్ లకు హై అలెర్ట్ ప్రకటించారు. బోర్డర్ లో కూడా భద్రతను పెంచారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎక్స్ ట్రా భద్రతా సిబ్బందిని మోహరించారు.
Also Read: Nikki Haley: భారత్ తో సంబంధాలు చెడగొట్టుకోవద్దు..ట్రంప్ కు నిక్కీ హేలీ వార్నింగ్..