Airport: దారుణం.. విమానం ఇంజిన్‌లో పడి వ్యక్తి మృతి

ఇటలీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా విమానం ఇంజిన్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. మిలాన్ బెర్గామో అనే ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది. ఆ యువకుడు సూసైడ్ చేసుకునేందుకే ఇలా చేశాడా ? లేదా ఇంకేమైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

New Update
Man Dies After Getting Sucked Into Plane Engine At Milan Airport in Italy

Man Dies After Getting Sucked Into Plane Engine At Milan Airport in Italy

ఇటలీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా విమానం ఇంజిన్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. మిలాన్ బెర్గామో అనే ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. 35 ఏళ్లున్న ఓ యువకుడు మంగళవారం మిలాన్ బెర్గామో ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్ బయట తన వాహనాన్ని బయట పెట్టి.. భద్రతా సిబ్బంది కంటపడకుండా విమానం పార్కింగ్ జోన్‌కు వెళ్లే అత్యవసర ద్వారాన్ని బలవంతంగా తెరిచాడు. అనంతరం రన్‌వేపై పరుగులు తీశాడు. 

Also Read: మహారాష్ట్రలో ముదురుతున్న భాషా వివాదం.. హిందీ VS మరాఠీ

Man Dies After Getting Sucked

అక్కడ ఉన్న ఎయిర్‌బస్‌ ఏ319 విమానం దగ్గరికి వెళ్లేసరికి.. దాని ఇంజిన్ వేగానికి అందులో కూరుకుపోయాడు. చివరికీ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అక్కడికి చేరుకొన్నారు. ఇంజిన్‌ను ఆపేసి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటన వల్ల కొన్ని గంటలుగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఆ యువకుడు సూసైడ్ చేసుకునేందుకే ఇలా చేశాడా ? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా ? అనే కోణంలో ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  

Also Read :  కల్తీ కల్లు తాగి.. 11 మంది స్పాట్‌లో..

Also Read :  బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?

Also Read:  శ్రీ రాముడు నేపాల్‌లో జన్మించాడు.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు

telugu-news | rtv-news

Advertisment
Advertisment
తాజా కథనాలు