Digital Airport: ముంబైలో మొట్ట మొదటి డిజిటల్ ఎయిర్‌పోర్ట్.. దీని ప్రత్యేకతలివే!

ప్రధాని మోదీ బుధవారం నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశ ప్రారంభించారు. రూ.19,650 కోట్ల భారీ వ్యయంతో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం కింద అభివృద్ధి చేయబడిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, దేశంలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ ఎయిర్‌పోర్ట్‌గా నిలిచింది.

New Update
Navi Mumbai Digital Airport

భారతదేశంలో విమానయాన రంగం మరో చారిత్రక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశ ప్రారంభించారు. సుమారు రూ.19,650 కోట్ల భారీ వ్యయంతో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) కింద అభివృద్ధి చేయబడిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, దేశంలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ ఎయిర్‌పోర్ట్‌గా నిలిచింది.

దీని డిజైన్‌ను ప్రపంచ ప్రఖ్యాత లండన్ సంస్థ జహా హదీద్ ఆర్కిటెక్ట్స్ (ZHA) రూపొందించింది. ZHA రూపొందించిన టెర్మినల్ కేవలం అలంకారం మాత్రమే కాదు, విమానాశ్రయ నిర్మాణానికి పునాదిగా నిలిచింది. టెర్మినల్ మధ్యలో విచ్చుకుంటున్న తామర రేకులను పోలిన 12 శిల్పకళాత్మక స్తంభాలు ఉన్నాయి.

డిజిటల్ ఫీచర్లతో ప్రయాణం..
ఈ అత్యాధునిక విమానాశ్రయం ప్రయాణికులకు యాంగ్జైటీ ఫ్రీ అనుభవాన్ని అందించే లక్ష్యంతో పూర్తిగా డిజిటల్ సౌకర్యాలతో రూపొందించబడింది. 
ఆన్‌లైన్ సేవలు: వాహన పార్కింగ్ స్థలాలను ముందుగా బుక్ చేసుకోవడం, ఆన్‌లైన్ బ్యాగేజ్ డ్రాప్, ఇమ్మిగ్రేషన్ సేవలు వంటి డిజిటల్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
AI ఆధారిత టెర్మినల్: పూర్తిగా ఆటోమేటెడ్, AI ఆధారిత టెర్మినల్ ప్రొగ్రామ్‌లు వేగవంతం అవుతాయి.
బ్యాగేజ్ ట్రాకింగ్: ప్రయాణికులు తమ ఫోన్లలోనే తమ లగేజీ ఏ కన్వేయర్ బెల్ట్‌పై ఉందో తెలుసుకునే సౌకర్యం ఉంది.

1,160 హెక్టార్లలో విస్తరించిన NMIA ప్రారంభంతో ముంబై సిటీ లండన్, న్యూయార్క్, టోక్యో లాంటి ప్రపంచ స్ధాని ఎయిర్‌పోర్టుల సరసన నిలిచింది. మొదటి దశలో ఒక రన్‌వే, ఒక టెర్మినల్‌తో ఏటా 20 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

భవిష్యత్ లక్ష్యాలు:
విమానాశ్రయం పూర్తి స్థాయిలో (నాలుగు టెర్మినల్స్, రెండు రన్‌వేలు) అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఏటా 90 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే స్థాయికి చేరుకుంటుంది. అంతేకాకుండా ఇది పవర్ రిప్రొడక్షన్, రెయిన్ వాటర్ స్టోరేజ్ వంటి సౌకర్యాలను కూడా కలిగి ఉంది. ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కమలం పువ్వుని పోలి ఉంటుంది. ఈ మెగా ప్రాజెక్ట్ లాజిస్టిక్స్, ఐటీ, హాస్పిటాలిటీ వంటి వివిధ రంగాలలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా. వాణిజ్య కార్యకలాపాలు డిసెంబర్ 2025లో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు