BREAKING : హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం

హైదరాబాద్ బేగంపేట్‌ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆగంతకుల మెయిల్‌తో అప్రమత్తమైన పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

New Update
Begumpet Airport

Hyderabad Begumpet Airport

BREAKING : హైదరాబాద్ నగరంలోని బేగంపేట్‌ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆగంతకుల మెయిల్‌తో అప్రమత్తమైన తెలంగాణా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు.పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌ పోర్టు ఉద్యోగులు, సిబ్బందిన బయటకు తరలించిన పోలీసులు తనిఖీలు చేశారు. స్నిప్పర్‌ డాగ్స్‌, బాంబ్‌ డిటెక్షన్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు.  కాగా జాగిలాలు, బాంబ్ ఎక్స్ ప్లోజివ్ ఎక్స్ పర్ట్స్ బృందాలు ఎయిర్‌పోర్టును అణువణువు గాలిస్తున్నాయి. అత్యవసర సహాయక సిబ్బందిని సైతం ఎయిర్‌పోర్ట్‌ రప్పించింది.

Also Read : కుప్పం మహిళకు సీఎం చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం

పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఆకతాయిల పనిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెయిల్ ఐడీ ఆధారంగా ఆగంతకులను గుర్తించే పనిలో పడ్డారు.

Also Read : కోర్టు ఆగ్రహానికి గురైన కన్నప్ప సినిమా.. సెన్సార్ లేకుండానే విడుదలపై సందేహాలు

    వివరాల ప్రకారం.. బేగంపేట ఎయిర్‌పోర్టుకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. సదరు మెయిల్‌లో విమానాశ్రయంలో బాంబు ఉందని హెచ్చరించారు. దీంతో, అలర్ట్‌ అయిన పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టారు.  దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైం అధికారులు. మెయిల్ పంపిన వాళ్ల క్రెడెన్షియల్స్ కనుగొనేందుకు కసరత్తు ప్రారంభం. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో దేశంలోని పలు విమానాశ్రాయలకు కూడా ఇలాగే బాంబు బెదిరింపు కాల్స్‌, మెయిల్స్‌ రావడం సర్వసాధారణమైంది.ఇక, ఇలాంటి కాల్స్‌, మెయిల్స్‌ పెడితే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 

    Also Read: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..

    Advertisment
    తాజా కథనాలు