Baramati: అజిత్ పవార్‌ విమాన ప్రమాదానికి టేబుల్ టాప్ రన్‌వే కారణమా? టేబుల్ టాప్ రన్‌వే అంటే ఏంటీ?

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే అజిత్ పవార్ విమానం క్రాష్ ల్యాండింగ్ అయిన బారామతిలో టేబుల్ టాప్ రన్ వే ఉంది. ప్రమాదానికి టేబుల్‌ టాప్ రన్‌వేనే కారణం అనే వాదన వినవస్తోంది.

New Update
FotoJet (90)

Baramati Airport

Baramati : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి విమానాశ్రయం(airport) లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే అజిత్ పవార్ విమానం క్రాష్(Ajith Pawar Plane Crash) ల్యాండింగ్ అయిన బారామతిలో టేబుల్ టాప్ రన్ వే ఉంది. ప్రమాదానికి టేబుల్‌ టాప్ రన్‌వేనే కారణం అనే వాదన వినవస్తోంది. గతంలోనూ ఈ టేబుల్ టాప్ రన్‌వే వల్ల ప్రమాదాలు జరిగినట్లు చెప్తున్నారు. ప్రస్తుత ప్రమాదంతో టేబుల్ టాప్ రన్‌వే అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఈ టేబుల్ టాప్ రన్‌వే అంటే ఏంటి. ఎందుకు ప్రమాదాలకు కారణమవుతుందన్న చర్చ సాగుతోంది. అంతేకాదు ఇలాంటి టేబుల్ టాప్ రన్‌వేలు మన దేశంలో ఎన్ని, ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలపై పలువురు చర్చించుకుంటున్నారు. 
 
అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి విమానాశ్రయంలోని టేబుల్‌టాప్ రన్‌వేపై ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసలు ఇలాంటి రన్‌వేలు ఎందుకు ప్రమాదకరం అనే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ల్యాండింగ్ సమయంలో రన్‌వే పై విమానం కంట్రోల్ తప్పడం, పైలట్ సరిగా అంచనా వేయకపోవడం వల్ల గతంలోనూ ఇలాంటి టేబుల్ టాప్ రన్‌వేలపై ప్రమాదాలు జరిగినట్లు అదికారులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం.. ల్యాండింగ్ సమయంలో కూలిపోవడం ఇది కూడ టేబుల్ టాప్ రన్‌వే కావడం మరింత వివాదస్పదంగా మారింది.

Also Read :  సామాన్యుడికి మరింత దూరంగా... బంగారం ధరలు పైపైకే..

టేబుల్‌ టాప్ రన్‌వేలు అంటే ఏంటంటే?

కొండ ప్రాంతాలను చదును చేసి.. లేదా లోయల మధ్య ఎత్తైన పీఠభూమిపై నిర్మించే రన్‌వేలను టేబుల్‌టాప్ రన్‌వేలు అని పిలుస్తారు. ఇలాంటి టేబుల్ టాప్ రన్‌వేల చుట్టూ లోతైన లోయలు లేదా వాలుగా ఉంటాయి. ఇలాంటి టేబుల్ టాప్ రన్‌వేలపై విమానాలను ల్యాండింగ్ చేసే సమయంలో పైలట్లు అప్రమత్తంగా ఉండాలి లేదంటే ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. చుట్టూ లోయలు ఉండటం వల్ల రన్‌వే అంచు దాటి కొంచెం ముందుకు వెళ్లినా విమానం డైరెక్ట్‌ వెళ్లి ఆ లోయలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి విమానాశ్రయాలు.. ఎత్తైన ప్రాంతాల్లో నిర్మించడం వల్ల గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ల్యాండింగ్ సమయంలో విమాన వేగాన్ని కంట్రోల్ చేయడం పైలట్లకు చాలా కష్టంగా ఉంటుంది.

ఇక ఈ బారామతి విమానాశ్రయం విషయానికి వస్తే ఇది సముద్ర మట్టానికి సుమారు 604 మీటర్ల ఎత్తులో ఉంది. అంతేకాదు బారామతి ఎయిర్‌పోర్టులో అత్యాధునిక ల్యాండింగ్ పరికరాలు లేవని తెలుస్తోంది.. అది టేబుల్‌టాప్ తరహా రన్‌వే కావడం కూడా అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ప్రతికూల వాతావరణంలో పైలట్ విమానాన్ని మ్యాన్యువల్‌గా దింపేందుకు ప్రయత్నించినప్పుడు  అంచనా తప్పడంతో విమానం రన్‌వే అంచును ఢీకొట్టి పేలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.ఈ ప్రమాద ఘటన భారత విమానయాన రంగంలో భద్రతా లోపాలను మరోసారి ఎత్తిచూపింది. అంటే విమానాన్ని ల్యాండ్ చేయడానికి పైలట్లు పూర్తిగా తమ కళ్లపై, మ్యాన్యువల్ కంట్రోల్‌పైనే ఆధారపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా టేబుల్‌టాప్ రన్‌వేలు కొండలపై లేదా ఎత్తైన ప్రాంతాల్లో ఉండటం వల్ల.. పైలట్లకు రన్‌వే వాస్తవం కంటే దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనివల్ల ల్యాండింగ్ సమయంలో పైలట్లు అంచనా తప్పే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

భారతదేశంలో టేబుల్‌టాప్ రన్‌వేల చరిత్రలో ఇలాంటి ప్రమాదాలు చాలా వరకు జరిగాయి. అందులో ముఖ్యంగా 2010లో కర్ణాటక మంగళూరు ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వే అంచు దాటి లోయలో పడిపోవడంతో 158 మంది దుర్మరణం చెందారు.2020లో కేరళలోని కోజికోడ్‌లో భారీ వర్షంలో ల్యాండ్ అవుతున్న విమానం రన్‌వేను దాటి 35 అడుగుల లోతు లోయలో పడి రెండు ముక్కలు అయింది. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు మరణించారు.

Also Read :  హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ మంచు.. 1200పైగా రోడ్లు మూసివేత

మన దేశంలోని టేబుల్ టాప్ రన్‌వేలు

కోజికోడ్ (కాలికట్) ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (కేరళ)
మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (కర్ణాటక)
కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (కేరళ)
బారామతి ఎయిర్‌పోర్ట్ (మహారాష్ట్ర)
చిత్రకూట్ ఎయిర్‌పోర్ట్ (ఉత్తర్‌ప్రదేశ్‌) (నిర్మాణ దశ)
కుల్లు (భూంతర్) (హిమాచల్ ప్రదేశ్‌)
శిమ్లా ఎయిర్‌పోర్టు  (హిమాచల్ ప్రదేశ్)
పాక్యోంగ్ ఎయిర్‌పోర్టు (సిక్కిం)
లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్టు (మిజోరాం)

Advertisment
తాజా కథనాలు