Nepal : నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (Tribhuvan International Airport) లో విమానం కుప్పకూలింది. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (టీఐఏ)లో సౌర ఎయిర్‌లైన్స్ విమానం కూలి (Plane Crash) మంటలు చెలరేగాయి. 19 మంది ప్రయాణికులతో పోఖారాకు బయల్దేరిన విమానం టేకాఫ్ సమయంలో రన్‌వేపై నుంచి జారిపడిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
Saurya Airlines aircraft crashes during takeoff in Tribhuvan International Airport, Kathmandu. 19 people were aboard the Pokhara-bound plane.#Nepal #SauryaAirlines #planecrash pic.twitter.com/bBshC2KRqK
— Chaudhary Parvez (@ChaudharyParvez) July 24, 2024
క్రాష్ అయిన సమయంలో విమానం నుంచి పెద్ద మంటలు చెలరేగడంతో పొగ బాగా కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది, భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి పరిస్థితిని అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న సిబ్బందితో సహా 19 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది కెప్టెన్ పాఖ్యను రక్షించారు.
According to local media reports from Nepal, a domestic airline flight crashed and caught fire while landing at Kathmandu Airport on Wednesday. #BREAKING pic.twitter.com/KGExGP9zc5
— CGTN Global Watch (@GlobalWatchCGTN) July 24, 2024
నేపాల్ ఫ్లైట్ క్రాష్.. లైవ్ వీడియో..#Nepalflightcrash #LiveVideo #RTV pic.twitter.com/JAGLCb2aNT
— RTV (@RTVnewsnetwork) July 24, 2024