Floods: నేపాల్‌లో వరదల బీభత్సం.. 60 మంది మృతి
నేపాల్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులో మరో 20 మంది మృతి చెందారు.
నేపాల్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులో మరో 20 మంది మృతి చెందారు.
నేపాల్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని పదవికి రాజీనామా చేసి, సైనిక రక్షణలో ఉన్న కేపీ శర్మ ఓలీ తాజాగా ఆర్మీ బ్యారక్స్ నుండి బయటకొచ్చి, మరో అద్దె ఇంట్లోకి మారారు.
నరేంద్ర మోడీ గురువారం నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కితో ఫోన్లో మాట్లాడారు. నేపాల్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో మరణించిన వారికి ఆయన సంతాపం తెలిపారు. నేపాల్‌లో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించడానికి భారత్ అండగా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు.
నేపాల్ తాత్కాలిక ప్రభుత్వం మంత్రివర్గం విస్తరించింది. కొత్తగా ముగ్గురు మంత్రులను కేబినెట్లోకి తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రధానితో సహా నలుగురు సభ్యులు ఉన్నారు. రామేశ్వర్ ఖనాల్, ఓం ప్రకాష్ ఆర్యల్, కుల్మాన్ ఘిసింగ్లు నేడు మంత్రులుగా బాధ్యలు చేపట్టారు.
నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కార్కి 'జనరేషన్ జెడ్' నిరసనల్లో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ నిరసనలలో విధ్వంసానికి పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకువచ్చి, వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని ఆమె స్పష్టం చేశారు.
నేపాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సుశీల కర్కి భర్త పేరు దుర్గా ప్రసాద్ సుబేది. గతంలో నేపాల్ విమానం హైజాక్ చేశారు. ప్రభుత్వ నిధులు కోసం హైజాక్ చేయడంతో రెండేళ్ల పాటు అతన్ని జైలులో కూడా ఉంచినట్లు సమాచారం.
మొత్తానికి నేపాల్ రాజకీయ సంక్షోభానికి తెర పడింది. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి ప్రమాణం చేశారు. కొద్దిసేపటి క్రితం అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆమెతో ప్రమాణం చేయించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు యాత్రికులు నేపాల్‌కు వెళ్లారు. అదే సమయంలో నిరసనలు చెలరేగడంతో ఖాట్మాండ్కు సమీపంలో వాళ్ల బస్సుపై పలువురు దుండగులు దాడి చేశారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.