Nepal: నేపాల్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. 10 మంది..

నేపాల్‌లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. జెన్‌ జెడ్‌ యువత మరోసారి రోడ్లపై ఆందోళనకు దిగారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ సపోర్టర్లు, యువ ఆందోళనకారుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో మరోసారి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

New Update
Curfew reimposed after fresh tension in southern Nepal district

Curfew reimposed after fresh tension in southern Nepal district

నేపాల్‌(nepal) లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. జెన్‌ జెడ్‌(Nepal Gen Z protest) యువత మరోసారి రోడ్లపై ఆందోళనకు దిగారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ సపోర్టర్లు, యువ ఆందోళనకారుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో 10 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఇటీవల నేపాల్‌లో జెన్‌ జడ్ నిరసనలు జరగడంతో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కీ బాధ్యతలు చేపట్టారు.     

Also Read:  ఓటమి తర్వాత తొలిసారిగా స్పందించిన తేజస్వీ యాదవ్

Curfew In Nepal

ఇక వివరాల్లోకి వెళ్తే.. బుధవారం బారా జిల్లాలో జెన్‌జడ్(Gen-Z Manifestation) నిరసనాకారులు, కేపీ శర్మ ఓలీ సపోర్టర్లు ర్యాలీలు చేశారు. కొద్దిసేపటి తర్వాత ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. మొత్తంగా అక్కడ ఘర్షణ వాతావరణ నెలకొంది. దీంతో అలెర్ట్ అయిన అధికారులు కర్ఫ్యూ విధించారు. బుధవారం రాత్రి వరకు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. మరోవైపు నేపాల్‌లో శాంతి నెలకొల్పేందుకు భద్రతా బలగాలు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి సశీలా కార్కీ ఆదేశాలు జారీ చేశారు. 

Also Read: స్కూల్‌లో విద్యార్థినికి 100 గుంజీలు.. మృతి చెందిన బాలిక

నేపాల్‌లో 2 నెలల క్రితం చెలరేగిన ఆందోళనలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా యాప్స్‌ను బ్యాన్ చేయడం, అధికార ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు  వ్యతిరేకంగా జెడ్ జెడ్ యువత ఆందోళనలు చేపట్టారు. దీంతో కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత  సుశీలా కార్కీ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే వచ్చే ఏడాది మార్చిలో నేపాల్‌లో ఎన్నికలు జరగనున్నాయి.   

Advertisment
తాజా కథనాలు