Nepal: కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్..వివాదాస్పద మ్యాప్ తో వంద నోటు

భారత భూభాగాలను తమవిగా చూపిస్తూ నేపాల్ పదే పదే కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా ఆ దేశం రూ.100 నోట్లను రిలీజ్ చేసింది. వాటిపై కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు తమవే అన్నట్లు మ్యాప్ ను ముద్రించింది.

New Update
map

నేపాల్ కావాలని భారత్ మీదకు వస్తోంది. పదేపదేవివాస్పద ప్రదేశాలు మావే అంటూ భారత్ మీద కయ్యానికి కాలు దువ్వుతోంది. రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలతో కూడిన మ్యాప్‌తో నేపాల్‌ కేంద్ర బ్యాంక్‌ కొత్త రూ.వందనోట్లను విడుదల చేసింది. 2024 ఏడాదిలో తయారైనట్లుగా చూపించిన కొత్త నోట్ల వెనుకవైపు మధ్య భాగంలో లేత ఆకుపచ్చ రంగుతో వివాదాస్పద నేపాల్‌ మ్యాప్‌ ఉంది. అయితే నేపాల్ అధికారులు మాత్రం తమ దేశ వంద నోటుపై ఆ మ్యాప్ ఉండేదని..2020లో సవరించిన మ్యాప్‌ను ప్రభుత్వం విడుదల చేయడంతో దానికి అనుగుణంగా కొత్త నోట్లను తాజాగా జారీ చేసినట్లు వివరించారు.

బంగ్లాదేశ్ దీ ఇదే పద్ధతి..

పొరుగు దేశాలన్నీ భారత్ మీదనే పడ్డాయి. నేపాల్, బంగ్లాదేశ్ , నేపాలతో సహా అన్నీ సరిహద్దు భూభాగాలను తమ దేశంలో కలుపుకోవాలనే చూస్తున్నాయి. పాకిస్తాన్ సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఈ మధ్యనే బంగ్లాదేశ్ కూడా ఇదే పని చేసింది. భారత భూభాగాన్ని బంగ్లాదేశ్‌కు చెందినట్లుగా చూపిస్తూ ఓ వివాదాస్పద మ్యాప్‌ను విడుదల చేశారు. దాన్ని పాకిస్థాన్‌ జనరల్ షంషాద్‌ మీర్జాకు బహుమతిగా ఇచ్చారు. ఆ మ్యాప్‌లో ఏడు భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో ఉన్నట్లుగా చూపించారు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయకయూనస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి బంగ్లాదేశ్‌-పాకిస్థాన్ మధ్య సంబంధాలు దగ్గరవుతున్నాయి. అయితే ఇటీవల పాక్‌ జాయింట్ చీఫ్స్‌ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్‌పర్సన్ జనరల్ షంషాద్‌ మీర్జా బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయన యూనస్‌తో సమావేశమయ్యారు. దీంతో మీర్జాకు యూనస్‌ ‘Art of Triumph’ పేరుతో ఉన్న ఓ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ పుస్తకం కవర్‌ పేజీపై వక్రీకరించిన బంగ్లాదేశ్‌ మ్యాప్‌ ఉంది. అందులో ఏడు భారత ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు