PM Modi: నేపాల్ తాత్కాలిక ప్రధానికి మోదీ ఫోన్.. ఎందుకంటే?

నరేంద్ర మోడీ గురువారం నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కితో ఫోన్‌లో మాట్లాడారు. నేపాల్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో మరణించిన వారికి ఆయన సంతాపం తెలిపారు. నేపాల్‌లో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించడానికి భారత్ అండగా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు.

New Update
PM Modi speaks

నరేంద్ర మోడీ(narendra-modi) గురువారం నేపాల్(nepal) తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి(Sushila Karki) తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా నేపాల్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో మరణించిన వారికి ఆయన సంతాపం తెలిపారు. నేపాల్‌లో శాంతి, స్థిరత్వం, పురోగతిని పునరుద్ధరించడానికి భారత్ తన మద్దతు కొనసాగిస్తుందని మోడీ హామీ ఇచ్చారు. నేపాల్ కొత్త ప్రధానిగా సుశీలా కర్కి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ ఆమెతో మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం.

Also Read :  బోయింగ్‌ కంపెనీకి బిగ్‌షాక్.. విమాన ప్రమాదంపై కేసు

Modi Spoke To Nepal Interim PM

గత వారం నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు తీవ్రమైన హింసాత్మక ఘటనలకు దారితీశాయి. సోషల్ మీడియా(Social Media) నిషేధంతో మొదలైన ఈ ఆందోళనలు, అవినీతి, రాజకీయ నాయకుల పట్ల ఉన్న అసంతృప్తితో మరింత ఉధృతమయ్యాయి. ఈ ఘటనల్లో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 1800 మందికి పైగా గాయపడ్డారు. ప్రజాగ్రహానికి అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో నేపాల్‌ రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిరసనకారులైన ‘జెన్-జెడ్’ ప్రతినిధులు నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కిని తాత్కాలిక ప్రధానిగా నియమించాలని ప్రతిపాదించారు. ఆమె ఇటీవలే ఈ పదవిని స్వీకరించారు.

ప్రధాని మోదీ తన Xఖాతాలో ఆమెతో సంభాషణ వివరాలను షేర్ చేశారు. "నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కితో మాట్లాడాను. ఇటీవల జరిగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నా హృదయపూర్వక సంతాపం. నేపాల్‌లో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది" అని మోడీ పేర్కొన్నారు.

అంతకుముందు, ప్రధాని మోడీ సుశీలా కర్కి నియామకాన్ని మహిళా సాధికారతకు గొప్ప ఉదాహరణగా అభివర్ణించారు. భారతదేశం, నేపాల్ మధ్య ఉన్న బలమైన, చారిత్రక సంబంధాలను ప్రస్తావిస్తూ, ఈ క్లిష్ట సమయంలో భారత్ నేపాల్ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సంభాషణ ద్వారా ఇరు దేశాల మధ్య మైత్రి, సహకారం మరింత బలపడతాయని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి.

Also Read :  శబరిమలలో 4.5 కిలోల బంగారం మాయం.. హైకోర్టు దర్యాప్తుకి ఆదేశం

Advertisment
తాజా కథనాలు