Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. అమెరికా నుంచి సాయం పొందుతున్న 120 దేశాల లిస్టు విడుదల

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశం నుంచి సాయం లేదా సంక్షేమం పొందుతున్న 120 దేశాల జాబితాను విడుదల చేశారు. పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్‌, నేపాల్ వంటి మన పొరుగు దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి.

New Update
Trump

Trump

అమెరికా(america) అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) తమ దేశం నుంచి సాయం లేదా సంక్షేమం పొందుతున్న 120 దేశాల జాబితాను విడుదల చేశారు. పాకిస్థాన్(pakistan), చైనా(china), బంగ్లాదేశ్‌(bangladesh), నేపాల్(nepal) వంటి మన పొరుగు దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి. కానీ భారత్‌ మాత్రం లేదు. దీన్నిబట్టి భారత్‌ అమెరికాకు భారం కాదని.. దాని ఆర్థిక వ్యవస్థకు అండగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో భారతీయులే ఎక్కువగా సంపాదిస్తున్నట్లు డేటా చూపిస్తోంది. కానీ పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ నుంచి 40 నుంచి 54 శాతం కుటుంబాలు అమెరికా సాయంపై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. ప్యూ రీసెర్చ్‌ సెంటర్ ప్రకారం చూసుకుంటే భారతీయ సమాజం అమెరికాలో రెండో అతిపెద్ద ఆసియా సమూహంగా ఉంది. దీని సగటు వార్షిక ఆదాయం 151,000 కన్నా ఎక్కువ డాలర్లుగా ఉంది. 

Also Read: వీధికుక్కల వివాదం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

భారత్‌ ఈ లిస్టులో ఎందుకు లేదు 

అమెరికాలో ఉంటున్న భారతీయులు అక్కడి ప్రభుత్వంపై ఎక్కువగా ఆధారపడరు. వాళ్లు కష్టపడి పనిచేయడం ద్వారా జీవనోపాధిని పొందుతూ పన్నులు చెల్లిస్తున్నారు. వలసదారుల కోసం ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయడాన్ని కూడా ట్రంప్ తరచుగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా నుంచి సాయం పొందుతున్న దేశాల్లో భారత్‌ లేకపోవడంతో భారతీయుల ఆర్థిక బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ విడుదల చేసిన డేటా ప్రకారం బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన కుటుంబాల్లో 54.8 శాతం మంది అమెరికా సంక్షేమంపై ఆధారపడుతున్నాయి. అలాగే పాకిస్థాన్‌ నుంచి 40.2 శాతం కుటుంబాలు, నేపాల్ నుంచి 34.80 శాతం, చైనా 32.9 శాతం, ఉక్రెయిన్‌ నుంచి 42.7 శాతం కుటుంబాలకు అమెరికా ట్రెజరీ నుంచి సాయం పొందుతున్నాయి. 

Also Read: ప్రపంచ రాజకీయాలను మార్చుతున్న కనిపించని శక్తులు.. తెర వెనుక మాస్టర్ మైండ్స్ వీరే!

అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో భారతీయుల సగటు కుటుంబ ఆదాయం ఎక్కువగా ఉంది. ఫ్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం ఒక భారతీయ కుటుంబం సగటు వార్షిక ఆదాయం సుమారు 151,200 డాలర్లుగా (రూ.1.25 కోట్లకు పైగా) ఉంది. ఇది అమెరికా జాతీయ సగటు ఆదాయం కన్నా చాలా ఎక్కువ. అమెరికాలో ఉంటున్న మొత్తం ఆసియా జనాభాలో భారతీయులే దాదాపు 21 శాతం ఉన్నారు. వీళ్లు వైద్యులు, ఇంజనీర్లుగా అలాగే పలు కంపెనీల్లో CEO, మేనేజర్లు లాంటి కీలక బాధ్యతలు పోషిస్తున్నారు. అందుకే ట్రంప్ సంక్షేమ లిస్టులో భారత్‌ పేరు లేదు. అక్కడి భారతీయులను వారు పన్ను చెల్లింపుదారులుగా వ్యవహరిస్తారు. 

Advertisment
తాజా కథనాలు