Srisailam reservoir: శ్రీశైలం జలాశయం వద్ద విరిగిపడ్డ కొండ చరియలు..అప్రమత్తమైన అధికారులు
కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయం వద్ద కొండ చరియలు విరిగి పడ్డాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చే రహదారిలో కొండ చరియలు విరిగిపడటంతో వాహన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.