Srisailam reservoir:  శ్రీశైలం జలాశయం వద్ద విరిగిపడ్డ కొండ చరియలు..అప్రమత్తమైన అధికారులు

కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయం వద్ద కొండ చరియలు విరిగి పడ్డాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చే రహదారిలో  కొండ చరియలు విరిగిపడటంతో వాహన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.

New Update
Landslides near Srisailam reservoir

Landslides near Srisailam reservoir

కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయం(srisailam-reservoir) వద్ద కొండ చరియలు(Landslides) విరిగి పడ్డాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చే రహదారిలో  కొండ చరియలు విరిగిపడటంతో వాహన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.

Also Read :  వినాయక మండపంలో ఘోర అగ్నిప్రమాదం..

రోడ్డుపై పెద్ద పెద్ద బంరాళ్లు పడిపోవడంతో  రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రోడ్డుకు అడ్డంగా కొండ చరియలు విరిగిపడటంతో ప్రయాణీకులకు ఇబ్బంది ఎదురవుతోంది. ప్రతిసారి ఇదే పరిస్థితి ఏర్పడుతుండటంతో దీనికి పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. వర్షాలు పడిన ప్రతిసారి కొండ చరియలు విరిగిపడి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవ్వడంతో పాటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని పలువురు కోరుతున్నారు.మరోవైపు శ్రీశైలం జలాశయం 10 గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో.. యాత్రికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also Read :  ఏపీలో పండగ పూట పెను విషాదం.. ఆరుగురికి కరెంట్ షాక్..!

శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

ఇదిలా ఉండగా ఎగువన కురుస్తున్న వానలతో  శ్రీశైలం ప్రాజెక్టు(srisailam-project) కు వరద(Flood) పోటెత్తింది. డ్యాం నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్ట్  10 గేట్లు 10 అడుగులు మేర పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే నుంచి 2,69,280 క్యూసెక్కులు విడుదలవుతుంది. జూరాల, సుంకేసుల, నుంచి శ్రీశైలానికి 1,61,414 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది.  శ్రీశైలం ప్రాజెక్ట్  పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టం 882.50 అడుగులకు చేరుకుంది.

శ్రీశైలం  ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలుగా ఉండగా ఇప్పటివరకు  ప్రాజెక్ట్ ప్రస్తుత నీటినిల్వ 202.0439 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కుడి , ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేసి 62,067 క్యూసెక్కుల నీరు సాగర్ కు విడుదల చేస్తున్నారు.

Also Read :  నర్సాపూర్ ట్రైన్‌లో భారీ దొంగతనం.. 68 గ్రాముల బంగారం చోరీ చేసిన దుండగులు!

Advertisment
తాజా కథనాలు