శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. 10కి.మీ నిలిచిపోయిన వాహనాలు

శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అమ్రాబాద్‌ మండలం పాతాళగంగ నుంచి దోమలపెంట చెక్‌ పోస్టువరకు హైవేపై 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.

New Update
Srisailam

వీకెండ్ కావడంతో పర్యటలకు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు బారులుతీరారు. దీంతో శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గతకొన్ని రోజుల క్రితం శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తడంతో చూసేందుకు పర్యాటకులు భారీగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అమ్రాబాద్‌ మండలం పాతాళగంగ నుంచి దోమలపెంట చెక్‌ పోస్టువరకు భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.  

హైవేపై 10 కి.మీ మేర వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్డు కావడంతో వాహనాల రద్దీ ఎక్కువైతే ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. దీంతో పోలీసులు ట్రాఫిక్  క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు