CRIME :  ప్రియుడి మోజులో భర్తను లేపేసిన భార్య

కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో గొల్ల అహోబిలం హత్య కేసు చిక్కుముడిని పోలీసులు ఛేదించారు. అహోబిలంను హత్య చేయించింది ఆయన భార్యేనని పోలీసులు తేల్చారు. ప్రియుడి మోజులో పడి భర్తను భార్యే హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు.

New Update
wife kills husnband

Wife murder husband

CRIME :  కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో గొల్ల అహోబిలం హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 3న రాత్రి  ఆస్పరి మండలం దొడగుండ, తొగరగల్లు గ్రామాల మధ్య గొల్ల అహోబిలంను గుర్తు తెలియని వ్యక్తలు హత్య చేశారు.  అయితే విచారణ చేసిన పోలీసులు హత్య కేసు చిక్కుముడిని ఛేదించారు. అహోబిలంను హత్య చేయించింది ఆయన భార్యేనని పోలీసులు తేల్చారు. ప్రియుడి మోజులో పడి భర్తను భార్యే హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసులో భార్య, ప్రియుడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చూడండి:Dhoni The Chase Teaser: M.S ధోని ఊరమాస్ టీజర్.. యాక్టింగ్ గూస్‌బంప్స్

కాగా సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పరి మండలంలోని తోగల్‌గల్‌ గ్రామానికి చెందిన గొల్ల అహోబిలం, గొల్ల గంగావతి భార్యాభర్తలు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. అహోబిలం దంపతులు జీవనోపాధి కోసం కర్ణాటకలోని యాదగిరి జిల్లా రత్నడిగి గ్రామానికి వలసవెళ్లారు. అక్కడ చెన్నబసవ అనే వ్యక్తితో గొల్ల గంగావతికి తొమ్మిది నెలల క్రితం పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య ఆ పరిచయం ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారి తీసింది.  భార్య అక్రమ సంబంధం పై భర్త అహోబిలం పలు మార్లు గంగావతితో గొడవ పడ్డాడు. అయితే అక్కడే ఉంటే మరింత గొడవలు అవుతాయని ఈ దంపతులు ఇటివల సొంత గ్రామం అయిన తొగరగల్లు వచ్చారు.ప్రియుడిని దూరం చేసిన భర్తను భర్తను కడతేర్చేందుకు గంగావతి సిద్ధమైంది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చేందుకు నిర్ణయం తీసుకుంది. సొంతూరిలో భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.

Also Read: ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే ఆర్థిక సాయం.. వెలుగులోకి సంచలన నిజాలు

రెండు రోజుల క్రితం పన్నిన పథకం ప్రకారం కర్ణాటక నుంచి తన బైక్ పై వచ్చి ఆస్పరి లో మకాం వేసిన బసప్ప, అహోబిలం పయనించే మార్గంలో కాపు కాసి ఉన్నాడు. గంగవతి సొంత ఊరు కలపరి గ్రామంలో తన భర్త అహోబిలం భోజనం చేసి పక్కన ఉన్న తొగరగల్లు గ్రామంలో ఉండే తన తల్లితండ్రుల దగ్గరకు వెళ్తున్నాడని, తన ప్రియుడు బసప్పకు సమాచారం అందించింది. ప్లాన్ ప్రకారం తన బైక్ లో తెచ్చుకొన్న పదునైన ఆయుధం తో కాపు కాసిన చెన్నబసవ ప్లాన్ ప్రకారం తన బైక్ లో తెచ్చుకొన్న పదునైన ఆయుధం తో అహోబిలం వెళ్ళే బైక్ ను అడ్డగించి హత్య చేసి పరారయ్యాడు. కాగా అనుమానంతో గంగావతిని విచారించిన పోలీసులకు ప్రియుడ మోజులో పడి భర్తను హత్య చేయించినట్లు గుర్తించి నిందితులైన భార్య గంగావతి, ప్రియుడు చెన్నబసవను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Also Read : సోషల్ మీడియాలో నటి అశ్లీల వీడియోలు...ఆమె ఏం చేసిందంటే..?

ఇది కూడా చూడండి: BIG BREAKING: జగన్ కు మరో బిగ్ షాక్.. పాలిటిక్స్ లోకి షర్మిల కుమారుడు రాజారెడ్డి!

Advertisment
తాజా కథనాలు