/rtv/media/media_library/vi/ZSf3kI2e0mw/hq2.jpg)
Srisailam reservoir
Srisailam reservoir : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాయశయంలోకి భారీగా వరద నీటి ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లను తెరచి.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 1,39,297 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 95,534 క్యూసెక్కులుగా ఉంది.
Also Read: Shilpa Shetty: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!
ఇక, జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 883.00 అడుగులకు చేరుకుంది. పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.8070 కాగాప్రస్తుతం : 204.3520 టీఎంసీలు గా ఉంది.ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అలాగే, తుంగభద్ర డ్యామ్ కు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు డ్యామ్ 12 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ లోకి ఇన్ ఫ్లో 40,082 క్యూసెక్కులుగా.. అవుట్ ఫ్లో 40,657 క్యూ సెక్కులుగా ఉంది.
Also Read: HBD Shiva Rajkumar: 'హ్యాట్రిక్ హీరో' నిమ్మ శివన్న బర్త్ డే స్పెషల్.. ఈ విషయాలు మీకు తెలుసా!