/rtv/media/media_files/2025/07/13/mantralayam-tragedy-2025-07-13-13-23-43.jpg)
mantralayam tragedy
ఏపీలోని కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీ రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకునేందుకు మంత్రాలయం వెళ్లిన 7గురు ఫ్రెండ్స్ ప్రమాదానికి గురయ్యారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు తుంగభద్ర నదిలో దిగగా.. ముగ్గురు ఫ్రెండ్స్ నీటిలో గల్లంతయ్యారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : స్పెయిన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. వందల మందికిపైగా గల్లంతు
Also Read : అసీమ్ మునీర్‌కు అధ్యక్ష పదవి !.. పాక్ ప్రధాని సంచలన ప్రకటన
ఏపీలో గుండెపగిలే విషాదం
వారిది కర్నాటక రాష్ట్రం. హసన్‌లో ఒకే కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఏడుగురు యువకులు రెండు రోజులు సెలవులు రావడంతో శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు మంత్రాలయం వచ్చారు. ఇందులో భాగంగానే పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు.
అనంతరం శనివారం సాయంత్రం పుణ్యస్నానాలు ఆచరించేందుకు తుంగభద్ర నదిలోకి దిగారు. ఆ 7గురు స్నేహితులు కలిసి నదిలోపలకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఒక స్నేహితుడు కాలు జారి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అదే సమయంలో అతడిని పట్టుకోవడానికి మరో ఇద్దరు నీటిలో దిగారు. ఇలా అజిత్ (19), ప్రమోద్ (20), సచిన్ (20) ముగ్గురూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. మరో నలుగురు ముందుగానే జాగ్రత్తపడి ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసి గల్లంతైన యువకుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read : ఇండియాకు పాక్ పరోక్షంగా బెదిరింపులు.. న్యూక్లియర్ వార్నింగ్
Also Read : కనిపించకుండ పోయిన బాలిక..అరెస్ట్ భయంతో ఊరంతా ఖాళీ!
Latest crime news | ap-crime-news | karnool