Crime news: అత్యాచారం చేసి...అపై పోలీసులకు అప్పగించబోయి...

తల్లితో కలిసి మరో ఊరుకు వచ్చిన విద్యార్థిని తప్పిపోయింది. ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించి ఓ ఆటో డ్రైవర్‌కు చిక్కింది. ఆ బాలికకు మాయమాటలు చెప్పిన డ్రైవర్‌ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత లాడ్జ్‌లో దిగబెట్టే ప్రయత్నం లో పోలీసులకు చిక్కాడు.

New Update
uttar pradesh 14 year old boy raped seven year old girl

Auto driver rapes girl

Crime news: తల్లితో కలిసి మరో ఊరుకు వచ్చిన విద్యార్థిని తప్పిపోయింది. ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించి ఓ ఆటో డ్రైవర్‌కు చిక్కింది. ఆ బాలికకు మాయమాటలు చెప్పిన డ్రైవర్‌ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత లాడ్జ్‌లో దిగబెట్టే ప్రయత్నం లో పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కి్స్తున్నాడు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Also Read: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!


కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న బాలిక తన తల్లితో కలిసి ఈ నెల 4న ఎమ్మిగనూరుకు వచ్చింది. అయితే పని ముగించుకుని సాయంత్రం ఇంటికివెళ్లే క్రమంలో బాలిక తప్పిపోయింది. తన తల్లి జాడ వెతుకుతూ ఆదోని పట్టణం బసవేశ్వర సర్కిల్‌కు చేరుకుంది. అక్కడి నుంచి బస్టాండ్‌కు వెళ్లి, తన సొంత ఊరికి వెళ్లాలనుకున్న ఆ బాలిక ఆదోని మండలం ఇస్వీ గ్రామానికి చెందిన రమేశ్‌ అనే డ్రైవర్‌ ఆటోను ఎక్కింది. ఆమెను తీసుకుని బస్టాండ్‌కు వెళ్లే సమయానికి రాత్రి కావడంతో వారి ఊరికి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్లేందుకు బస్సులు ఉండవని, ఈ రాత్రికి సమీపంలో ఉన్న తన అక్క వాళ్ల ఇంట్లో ఉండవచ్చని నమ్మించాడు. అది నిజమేనని నమ్మిన ఆ బాలిక అతనితో పాటు వెళ్లింది.

Also Read: ట్రంప్‌కు ఝలక్‌ ఇచ్చిన ఎలాన్‌మస్క్‌..కొత్త పార్టీ ప్రారంభం


కానీ, రమేష్‌ ఆమెను అదే ఆటోలో పట్టణ శివారులోని ఓ నిర్మానుష  వెంచర్‌లోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. భయంతో బాధితురాలు రోదించింది, దీంతో తోటి  స్నేహితులతో కలిసి ఆమెను ఆదోనిలోని ఓ ప్రైవేటు లాడ్జ్‌లో వదిలేందుకు తీసుకు పోయాడు.  అయితే పోలీసుల అనుమతి ఉంటేనే  లాడ్జ్‌ లో చేర్చుకుంటామని నిర్వాహకులు చెప్పడంతో.. అనుమతి కోసమని నిందితుడు ఆ అమ్మాయిని తీసుకుని మూడో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ పోలీసులు ఎంక్వయిరీ చేసే క్రమంలో అతని తీరును అనుమానించారు.  బాలికను ఆరా తీయగా తనపై జరిగిన అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రమేశ్‌పై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా బాలిక తల్లిదండ్రులను పిలిపించి ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు.

Advertisment
తాజా కథనాలు