Indian Army: కశ్మీర్లో సైనికులు మిస్సింగ్.. ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్
దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా గడూల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా భారత సైన్యానికి చెందిన ఇద్దరు పారా కమాండోలు అదృశ్యమయ్యారు. ఆర్మీ ఇద్దరు జవాన్లతో కమ్యూనికేషన్ కోల్పోయింది. వారిని వెతకడం కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి.